అపోలో హాస్పిటల్స్ లాభం రూ.551 కోట్లు
ABN , Publish Date - May 21 , 2026 | 02:08 AM
త ఆర్థిక సంవత్సరం(2025-26)లో మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి (క్యూ4) అపోలో హాస్పిటల్స్ ఏకీకృత నికర లాభం...
ఒక్కో షేరుకు రూ.10 డివిడెండ్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): గత ఆర్థిక సంవత్సరం(2025-26)లో మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి (క్యూ4) అపోలో హాస్పిటల్స్ ఏకీకృత నికర లాభం రూ.551.3 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఇదే కాలానికి గడించిన రూ.414.5 కోట్ల లాభంతో పోలిస్తే 33శాతం వృద్ధి నమోదైంది. ఆదాయం 18.1 శాతం వృద్ధితో రూ.5,592.2కోట్ల నుంచి రూ.6,605.5 కోట్లకు ఎగబాకింది. అందులో హెల్త్‌కేర్ సేవల విభాగ ఆదాయం 17.25 శాతం పెరుగుదలతో రూ.3,333.7 కోట్లకు చేరుకోగా.. అపోలో హెల్త్ అండ్ లైఫ్‌స్టైల్ విభాగ రెవెన్యూ 24.4 శాతం ఎగబాకి రూ.489.5 కోట్లకు చేరింది. అపోలో హెల్త్‌కో విభాగ ఆదాయం 20శాతం వృద్ధితో 2,848.2 కోట్లుగా నమోదైంది. కాగా, ఈ మార్చితో ముగిసిన మూడు నెలల్లో అపోలో హాస్పిటల్స్ మొత్తం ఖర్చులు వార్షిక ప్రాతిపదికన 15.33శాతం పెరుగుదలతో రూ.5,938 కోట్లకు చేరాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను వాటాదారులకు రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.10 తుది డివిడెండ్ చెల్లించాలని అపోలో హాస్పిటల్స్ బోర్డు సిఫారసు చేసింది. బీఎ్‌సఈలో ఈ కంపెనీ షేరు 0.91 శాతం పెరిగి రూ.8,098.65 వద్ద ముగిసింది.
అనుబంధ విభాగం విలీనం: అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌లోకి పూర్తి అనుబంధ విభాగమైన అపోలో హాస్పిటల్స్ నార్త్ లిమిటెడ్‌ను విలీనం చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. చట్టపరమైన అనుమతులకు లోబడి ఈ ప్రక్రియ పూర్తికానుందని సంస్థ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి..
రెండు వందల అడుగుల ఎత్తులో నిలిచిపోయిన రోలర్ కోస్టర్.. షాకింగ్ వీడియో వైరల్..
చంద్రయాన్-3 మరో సంచలనం.. విక్రమ్ ల్యాండర్ కీలక ఆవిష్కరణ.