అపోలో హాస్పిటల్స్ లాభంలో 32 శాతం వృద్ధి
ABN , Publish Date - Nov 05 , 2026 | 02:53 AM
ఈ ఆర్థిక సంవత్సరం(2026-27)లో సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి(క్యూ2) అపోలో హాస్పిటల్స్ ఏకీకృత నికర లాభం...
క్యూ2లో రూ.658.4 కోట్లుగా నమోదు
హైదరాబాద్(ఆంధ్రజ్యోతి బిజినెస్): ఈ ఆర్థిక సంవత్సరం(2026-27)లో సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి(క్యూ2) అపోలో హాస్పిటల్స్ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 31.5 శాతం వృద్ధితో రూ.658.4 కోట్లకు చేరుకుంది. ఆదాయం గణనీయంగా పెరగడం ఇందుకు దోహదపడింది. గత ఆర్థిక సంవత్సరం(2025-26)లో ఇదే కాలానికి లాభం రూ.500.6 కోట్లుగా నమోదైంది. కాగా, ఈ క్యూ2లో అపోలో హాస్పిటల్స్ రాబడి రూ.7,614.9 కోట్లకు ఎగబాకింది. 2025-26 క్యూ2లో ఇది రూ.6,186.8 కోట్లుగా ఉంది. అయితే, ఖర్చులు కూడా రూ.5,568.3 కోట్ల నుంచి రూ.6,768.3 కోట్లకు పెరిగాయి. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రథమార్ధానికి(ఏప్రిల్-సెప్టెంబరు) అపోలో హాస్పిటల్స్ లాభం రూ.1,227.8 కోట్లుగా నమోదైంది. క్రితం ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి లాభం రూ.947.7 కోట్లుగా నమోదైంది. కాగా, హాస్పిటల్స్ విభాగ ప్రెసిడెంట్, సీఈఓ డాక్టర్ మధు శశిధర్ ఈనెల 14న పదవి నుంచి తప్పుకోబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి..
అమెరికా మిడ్‌టర్మ్ ఫలితాలపై కమలా హారిస్ స్పందన.. 'హల్లెలూయ' వీడియో వైరల్..
అమెరికా కాంగ్రెస్‌పై డెమోక్రాట్ల పట్టు.. భారత్ పరిస్థితేంటి..