అపోలో చేతికి బెంగళూరు హాస్పిటల్
ABN , Publish Date - Feb 11 , 2026 | 06:14 AM
అపోలో హాస్పిటల్స్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా బెంగళూ రు కేంద్రంగా పని చేసే బెలినెస్ ఛాంపియన్...
డీల్ విలువ రూ.165 కోట్లు
అపోలో హాస్పిటల్స్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా బెంగళూ రు కేంద్రంగా పని చేసే బెలినెస్ ఛాంపియన్ హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను అపోలో అనుబంధ సంస్థ ఇంపీరియర్ హాస్పిటల్ అండ్ రీసెర్చి సెంటర్ లిమిటెడ్ (ఐహెచ్‌ఆర్‌సీఎల్) కొనుగోలు చేసింది. ఆస్తు లు, అప్పులతో కలిపి మొత్తం డీల్ విలువ రూ.165 కోట్లు. ప్రస్తుతం 125 పడకలతో పనిచేస్తున్న ఈ హాస్పిటల్‌ను ఈ ఏడాది జూన్‌కల్లా 175 పడకల హాస్పిటల్‌గా తీర్చిదిద్దనున్నట్టు అపోలో హాస్పిటల్స్ తెలిపింది.
క్యు3 లాభం రూ.502 కోట్లు: అపోలో హాస్పిటల్స్ డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో అనుబంధ కంపెనీలతో కలిసి (కన్సాలిడేటెడ్) రూ.6,477.4 కోట్ల ఆదాయంపై రూ.502 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ ఆదాయం 17ు, నికరలాభం 35ు పెరిగాయి. వాటాదారులకు ఒక్కో షేరుపై రూ.10 మధ్యంతర డివిడెండ్ చెల్లించాలని కంపెనీ బోర్డు సిఫారసు చేసింది. ఇందుకు ఈ నెల 16వ తేదీని రికార్డ్ తేదీగా నిర్ణయించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
పాల వ్యాన్‌లో రేషన్ బియ్యం తరలింపు.. కేసు నమోదు
మున్సిపల్ ఎన్నికలు... సెలవు ప్రకటించిన సర్కార్..
For More AP News And Telugu News