ఎపిస్ ఇండియా నుంచి మసాలా ఖర్జూరం
ABN , Publish Date - Mar 19 , 2026 | 02:19 AM
ఎపిస్ బ్రాండ్ పేరుతో తేనెను మార్కెట్ చేస్తున్న ఎపిస్ ఇండియా వ్యాపార విస్తరణ చేపట్టింది. ఇందులో భాగంగా ఆరోగ్యానికి దోహదం చేసే ఖర్జూరాల్ని...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఎపిస్ బ్రాండ్ పేరుతో తేనెను మార్కెట్ చేస్తున్న ఎపిస్ ఇండియా వ్యాపార విస్తరణ చేపట్టింది. ఇందులో భాగంగా ఆరోగ్యానికి దోహదం చేసే ఖర్జూరాల్ని భారతీయ మసాలా దినుసులతో మేళవించి ‘మిస్క్’ బ్రాండ్ పేరుతో మార్కెట్‌లో విడుదల చేసింది. గింజలు తీసిన ఈ ఖర్జూర పలుకులు ప్రస్తుతం అచార్, చింతపండు, చిల్లీ ఫ్లేవర్స్‌లో మార్కెట్‌లో విడుదల చేస్తున్నట్టు కంపెనీ ఎండీ అమిత్ ఆనంద్ చెప్పారు. నలభై గ్రాముల పరిమాణంలో రూ.20లకే లభించే ఈ మసాలా ఖర్జూరాలను, ప్యాక్ చేసిన తేదీ నుంచి తొమ్మిది నెలల వరకు ఉపయోగించవచ్చని తెలిపారు. ఆరోగ్యాన్ని దెబ్బతీసే పంచదారతో చేసిన చిరుతిళ్మకు తమ మిస్క్ బ్రాండ్ మసాలా ఖర్జూరాలు చక్కటి ప్రత్యామ్యాయమన్నారు. ఉత్తరాఖండ్‌లోని రూర్కీ వద్ద ఉన్న ప్లాంట్‌లో ఎపిస్ ఇండియా ఈ మసాలా ఖర్జూర ప్యాకెట్లను ప్యాక్ చేస్తోంది. త్వరలో ఇదే ప్లాంట్‌లో ఖర్జూర జామ్‌ను కూడా తయారు చేసే యోచన ఉందని ఎండీ చెప్పారు.
ఇవి కూడా చదవండి..
జియో కీలక ప్రకటన.. రోమింగ్ ప్యాక్ లేకున్నా ఓటీపీలు
సూచీలకు వరుసగా మూడో రోజూ లాభాలే.. రూపాయి భారీ పతనం..