Share News

రెండు కొత్త హౌసింగ్‌ ప్రాజెక్టులపై అపర్ణ రూ.1,825 కోట్ల పెట్టుబడి

ABN , Publish Date - Nov 26 , 2026 | 04:30 AM

అపర్ణ కన్‌స్ట్రక్షన్స్‌ అండ్‌ ఎస్టేట్స్‌ తన విస్తరణ ప్రణాళికలో భాగంగా హైదరాబాద్‌, బెంగళూరులో రెండు కొత్త...

రెండు కొత్త హౌసింగ్‌ ప్రాజెక్టులపై అపర్ణ రూ.1,825 కోట్ల పెట్టుబడి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అపర్ణ కన్‌స్ట్రక్షన్స్‌ అండ్‌ ఎస్టేట్స్‌ తన విస్తరణ ప్రణాళికలో భాగంగా హైదరాబాద్‌, బెంగళూరులో రెండు కొత్త గృహ ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు రూ.1,825 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు బుధవారం వెల్లడించింది. బెంగళూరులోని ప్రాజెక్టు ‘అపర్ణ వండర్‌ వుడ్స్‌’ 14.9 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉంటుందని, ఇందులో 1,261 అపార్ట్‌మెంట్లు ఉంటాయని కంపెనీ డైరెక్టర్‌ రాకేష్‌ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో 6.4 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ‘అపర్ణ సైబర్‌జెడ్‌’ ప్రాజెక్టులో 759 అపార్ట్‌మెంట్లు ఉంటాయన్నారు. 2030 నాటికి తన రెసిడెన్షియల్‌ పోర్ట్‌ఫోలియోను 10 కోట్లకు పైగా చదరపు అడుగులకు విస్తరించాలన్న లక్ష్యంతో కంపెనీ ఉంది.

ఇవి కూడా చదవండి:

వైభవ్ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా బాదేస్తాడు: చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా

ఐపీఎల్ 2027: వేలంలోకి వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్

Updated Date - Nov 26 , 2026 | 04:30 AM