ఆంథ్రోపిక్ రూ.6 లక్షల కోట్ల ఐపీఓ
ABN , Publish Date - Nov 11 , 2026 | 05:55 AM
అమెరికాకు చెందిన కృత్రిమ మేధ (ఏఐ) దిగ్గజం, ప్రముఖ జనరేటివ్ ఏఐ మోడల్ ‘క్లాడ్’ అభివృద్ధి సంస్థ ఆంథ్రోపిక్ తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు రాబోతున్న సంగతి తెలిసిందే.
ఇష్యూ ధరల శ్రేణి 70-78 డాలర్లుగా ఖరారు
రూ.132 లక్షల కోట్లకు కంపెనీ మార్కెట్ విలువ
న్యూయార్క్: అమెరికాకు చెందిన కృత్రిమ మేధ (ఏఐ) దిగ్గజం, ప్రముఖ జనరేటివ్ ఏఐ మోడల్ ‘క్లాడ్’ అభివృద్ధి సంస్థ ఆంథ్రోపిక్ తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందు కు సంబంధించి కంపెనీ తాజాగా మరిన్ని విషయాలను అధికారికంగా ప్రకటించింది. ఐపీఓలో భాగంగా 82.5 కోట్ల షేర్లను విక్రయించనున్నట్లు అమెరికన్ క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (సెక్)కు సమర్పించిన తాజా పత్రాల్లో కంపెనీ వెల్లడించింది. ఈ ఐపీఓ ధరల శ్రేణిని 70-78 డాలర్లుగా నిర్ణయించింది. ఈ ధరల శ్రేణిలో గరిష్ఠ స్థాయి ప్రకారంగా కంపెనీ 6,435 కోట్ల డాలర్లు (దాదాపు రూ.6.05 లక్షల కోట్లు) సమీకరించే అవకాశం ఉంది. ఈ లెక్కన కంపెనీ ఐపీఓ ద్వారా 1.405 లక్షల కోట్ల డాలర్ల (రూ.132 లక్షల కోట్లు) మార్కెట్ విలువను ఆశిస్తోంది. ఈ నెలలోనే ఆంథ్రోపిక్ ఐపీఓ ప్రక్రియను పూర్తి చేయడంతోపాటు స్టాక్ మార్కెట్లో తన షేర్లను నమోదు చేసే అవకాశం ఉంది. ‘ఏఎన్‌టీ’ సింబల్‌తో ఈ షేర్లు ట్రేడవనున్నాయి. కాగా, ఈ జూన్‌లో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన రాకెట్ల తయారీ కంపెనీ స్పేస్‌ఎక్స్ ఐపీఓ ద్వారా 8,600 కోట్ల డాలర్లు (రూ.8.08 లక్షల కోట్లు) సమీకరించింది. ప్రపంచంలో ఇప్పటివరకిదే అత్యంత విలువైన పబ్లిక్ ఇష్యూ.
ఇవి కూడా చదవండి..
బంగ్లాదేశ్‌లో అడుగుపెడితే షేక్ హసీనాకు ఉరిశిక్ష అమలు తప్పదు!
దాడికి సిద్ధంగా ఉన్నాం.. ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడి వార్నింగ్