Share News

ఆంథ్రోపిక్‌ ఉద్యోగుల్లో దాదాపు అందరూ మిలియనీర్లే

ABN , Publish Date - Nov 20 , 2026 | 03:04 PM

ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్ స్టాక్‌మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వడం సంస్థ ఉద్యోగులను అమాంతం మిలియనీర్లుగా మార్చేసింది.

ఆంథ్రోపిక్‌ ఉద్యోగుల్లో దాదాపు అందరూ మిలియనీర్లే
Anthropic employees millionaires

ఇంటర్నెట్ డెస్క్: ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్ స్టాక్‌మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వడం సంస్థ ఉద్యోగులను అమాంతం మిలియనీర్లుగా మార్చేసింది. ఉద్యోగుల్లో దాదాపు 96 శాతం మంది (5,100 మంది ఉద్యోగులు) నికర సంపద విలువ 1 మిలియన్ డాలర్లు దాటిపోయినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వీరిలో 2,800 మంది నికర సంపద 10 మిలియన్‌లను దాటింది. సంస్థ ఐపీఓ బంపర్ హిట్ కావడంతో మాజీ ఉద్యోగులు కూడా మిలియనీర్లుగా మారిపోయారు. ఆంథ్రోపిక్ ఉద్యోగులు తమ పారితోషికం కింద సంస్థలో వాటాలు కూడా పొందిన విషయం తెలిసిందే.


ఆంథ్రోపిక్‌లో దాదాపు 5,300 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 5,100 మందికి కంపెనీలో ఇక్విటీ హోల్డింగ్స్ ఉన్నాయి. వీరిలో 600 మంది వాటాల విలువ కూడా చెరో 100 మిలియన్ డాలర్లకు చేరింది. అయితే, ఇదంతా ప్రస్తుతం వారి వద్ద ఉన్న వాస్తవ సంపద కాదని కూడా నిపుణులు చెబుతున్నారు. షేర్ల అమ్మకాలపై కొనసాగుతున్న ఆంక్షలు, మార్కెట్‌లో ఒడుదొడుకుల వల్ల ఈ డబ్బు కళ్లచూసేందుకు ఉద్యోగులకు మరింత కొంత సమయం పడుతుంది.

ఐపీఓ నేపథ్యంలో ఆంథ్రోపిక్ వ్యవస్థాపకులపై కూడా కనకవర్షం కురిసింది. ఏడు సహవ్యవస్థాపకులు ఒక్కొక్కరికీ సంస్థలో ఉన్న వాటా విలువ 20 బిలియన్ డాలర్లను దాటింది. ఆంథ్రోపిక్‌ సీఈఓ నికర సంపద విలువ ప్రస్తుతం 20.7 బిలియన్ డాలర్లని సమాచారం.


ఆంథ్రోపిక్ తొలినాళ్లల్లో పెట్టుబడి పెట్టిన సంస్థల విలువ కూడా భారీగా పెరిగింది. ఉదాహరణకు.. హాలీవుడ్ నటుడు ఆష్టన్ కుచ్చర్, గయ్ ఆసియరీ స్థాపించిన సౌండ్ వెంచర్స్‌కు ఆంథ్రోపిక్‌లో ఉన్న వాటా విలువ ప్రస్తుతం 7.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇక దివేశ్ మాకెన్, మైఖేల్ ఆండర్స్, చాడ్ బోడింగ్ స్థాపించిన ఐసీఓఎన్ఐక్యూ క్యాపిటల్‌కు ఆంథ్రోపిక్‌లో ఉన్న వాటా విలువ కూడా 30 బిలియన్ డాలర్లు. సంస్థ బోర్డు సభ్యుడైన వాస్ నరసింహన్ వాటా విలువ కూడా 14.6 మిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.


ఈ వార్తలనూ చదవండి:

అదరగొట్టిన ఆంథ్రోపిక్.. 2 ట్రిలియన్ డాలర్లకు చేరిన కంపెనీ విలువ..

బంగారం, వెండి ధరల భారీ పతనం..

Updated Date - Nov 20 , 2026 | 03:45 PM