Agnivesh Agarwal: అనిల్ అగర్వాల్ కుమారుడు మృతి
ABN , Publish Date - Jan 08 , 2026 | 06:14 AM
మైనింగ్ దిగ్గజం అనిల్ అగర్వాల్ పెద్ద కుమారుడు అగ్నివేశ్ అగర్వాల్ గుండెపోటుతో మర ణించారు....
న్యూఢిల్లీ: మైనింగ్ దిగ్గజం అనిల్ అగర్వాల్ పెద్ద కుమారుడు అగ్నివేశ్ అగర్వాల్ గుండెపోటుతో మర ణించారు. ఆయన వయసు 49 సంవత్సరాలు. వేదాంత గ్రూప్ కంపెనీ తల్వాండి సాబూ పవర్ లిమిటెడ్ బోర్డు సభ్యుడుగా ఉన్న ఆయన ఇటీవల స్కైయింగ్ ప్రమాదం లో గాయపడి కోలుకుంటున్న దశలో గుండెపోటుకు గురైనట్టు సమాచారం. అనిల్ అగర్వాల్‌కు అగ్నివేశ్‌తో పాటు ప్రియా అనే కుమార్తె కూడా ఉన్నారు. ఆమె హిందుస్తాన్ జింక్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురోకు గాయాలయ్యాయా.. వీడియో చూస్తే..
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..