అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌లో 3,500 ఉద్యోగాల కోత
ABN , Publish Date - Oct 25 , 2026 | 06:00 AM
అంతర్జాతీయ ఆర్థిక సేవల కంపెనీ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కూడా ఉద్యోగాల కోతకు పూనుకుంది. ప్రపంచవ్యాప్తంగా...
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆర్థిక సేవల కంపెనీ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కూడా ఉద్యోగాల కోతకు పూనుకుంది. ప్రపంచవ్యాప్తంగా తన కార్యాలయాల్లో పనిచేస్తున్న దాదాపు 78,000 మంది ఉద్యోగుల్లో 5 శాతం (సుమారు 3,500) మందిని తొలగించగలగనున్నట్లు ప్రకటించింది. ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు ఏఐ సాంకేతికత చెల్లింపు సేవల గతి, దిశను వేగంగా మార్చివేస్తున్న తరుణంలో కార్యకలాపాలను క్రమబద్ధీకరించే వ్యూహంలో భాగంగా ఉద్యోగులను తగ్గించుకోబోతున్నట్లు తెలిపింది.
ఈ వార్తలనూ చదవండి:
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల