Share News

2030 నాటికి భారత్‌లో మరో రూ.1.24 లక్షల కోట్ల పెట్టుబడులు

ABN , Publish Date - Jun 26 , 2026 | 05:46 AM

భారత్‌లో కృత్రిమ మేధ (ఏఐ), క్లౌడ్‌ మౌలిక సదుపాయాల విస్తరణ కోసం 2030 నాటికి 1,300 కోట్ల డాలర్ల (సుమారు రూ.1.24 లక్షల కోట్లు) అదనపు పెట్టుబడులు పెట్టనున్నట్లు అంతర్జాతీయ ఈ-కామర్స్‌...

2030 నాటికి భారత్‌లో మరో రూ.1.24 లక్షల కోట్ల పెట్టుబడులు

ప్రధాని మోదీతో భేటీ అనంతరం ప్రకటించిన అమెజాన్‌ సీఈఓ ఆండీ జెస్సీ

  • రూ.4.56 లక్షల కోట్లకు చేరుకోనున్న మొత్తం పెట్టుబడులు

న్యూఢిల్లీ: భారత్‌లో కృత్రిమ మేధ (ఏఐ), క్లౌడ్‌ మౌలిక సదుపాయాల విస్తరణ కోసం 2030 నాటికి 1,300 కోట్ల డాలర్ల (సుమారు రూ.1.24 లక్షల కోట్లు) అదనపు పెట్టుబడులు పెట్టనున్నట్లు అంతర్జాతీయ ఈ-కామర్స్‌, టెక్నాలజీ దిగ్గజం అమెజాన్‌ వెల్లడించింది. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న కంపెనీ సీఈఓ ఆండీ జెస్సీ గురువారం ప్రధాని మోదీని కలిసిన అనంతరం ఈ పెట్టుబడులను ప్రకటించారు. 2026-2030 కాలానికి భారత మార్కెట్లో 3,500 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు అమెజాన్‌ ఆరు నెలల క్రితమే వెల్లడించింది. తాజాగా ప్రకటించిన 1,300 కోట్ల డాలర్లతో కలిపి కంపెనీ మొత్తం పెట్టుబడులు 4,800 కోట్ల డాలర్లకు (రూ.4.56 లక్షల కోట్లు) చేరుకోనున్నాయి. అంతేకాదు, 2010- 2030 కాలానికి భారత్‌లో అమెజాన్‌ మొత్తం పెట్టుబడులు 8,800 కోట్ల డాలర్లను (రూ.8.36 లక్షల కోట్లు) మించిపోనున్నాయి. కంపెనీ వ్యాపార వృద్ధికి భారత్‌ అత్యంత కీలక మార్కెట్‌ అని జెస్సీ అభివర్ణించారు.

కంపెనీ ప్రణాళికలివి..

  • 38 లక్షల ఉద్యోగాల కల్పన ఫ 8,000 కోట్ల డాలర్ల విలువైన ఈ-కామర్స్‌ ఎగుమతులకు తోడ్పాటు ఫ 1.5 కోట్ల మంది చిన్న వ్యాపారులు, 40 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏఐ ప్రయోజనాలు భారత్‌లో అమెజాన్‌ పెట్టుబడులను స్వాగతిస్తున్నా. ఈ పెట్టుబడులు దేశీయ యువతకు కొత్త అవకాశాలను సృష్టిస్తాయి. అలాగే, మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోందనడానికి ఇదే నిదర్శనం.

ప్రధాని నరేంద్ర మోదీ

భారత మార్కెట్లో అమెజాన్‌ భవిష్యత్‌ ప్రణాళికలను ప్రఽధాని మోదీకి వివరించాను. దశాబ్దకాలానికి పైగా భారత కస్టమర్లు, స్టార్ట్‌పలు, విక్రేతలు, డెవలపర్లు, ఎంటర్‌ప్రైజె్‌సకు సేవలందిస్తున్నాం. భారత్‌లో మా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. భవిష్యత్‌పై ఉత్సాహంగా ఉన్నాం.

అమెజాన్‌ సీఈఓ ఆండీ జెస్సీ


ముంబై, హైదరాబాద్‌లోని

ఏడబ్ల్యూఎస్‌ డేటా సెంటర్ల విస్తరణ

తాజాగా ప్రకటించిన వాటితో కలిపి, భారత్‌లో ఏఐ, క్లౌడ్‌ మౌలిక వసతుల విస్తరణ కోసం ఈ ఐదేళ్లలో కంపెనీ మొత్తం పెట్టుబడులు 2,100 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.2 లక్షల కోట్లు) చేరనున్నాయి. ఈ అదనపు పెట్టుబడులతో ముంబై, హైదరాబాద్‌లోని ఏడబ్ల్యూఎ్‌స (అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌) డేటా సెంటర్ల సామర్థ్యాన్ని విస్తరించడంతో పాటు స్టార్ట్‌పలు, ఎంటర్‌ప్రైజెస్‌, ప్రభుత్వ సంస్థలకు తన కస్టమ్‌ ఏఐ చిప్స్‌, ఏఐ సేవలు, క్లౌడ్‌ టెక్నాలజీలు, డెవలపర్‌ టూల్స్‌కు యాక్సెస్‌ కల్పించనుంది.

ఇవి కూడా చదవండి:

పెళ్లి పేరుతో మోసం.. స్టార్ క్రికెటర్‌పై సంచలన ఆరోపణలు!

కన్నీళ్లు పెట్టుకున్న బ్రెజిల్ స్టార్ నెయ్‌మార్!

Updated Date - Jun 26 , 2026 | 05:46 AM