భారత్‌కు అమెజాన్ సీసీయూ విస్తరణ
ABN , Publish Date - Apr 10 , 2026 | 02:15 AM
దేశీయ వినియోగదారుల రక్షణకు పెద్ద పీట వేస్తూ తమ కౌంటర్‌ఫీట్ క్రైమ్స్ యూనిట్‌ను (సీసీయూ) భారత్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు...
నకిలీ వస్తువుల విక్రయాలపై ఉక్కుపాదం
న్యూఢిల్లీ: దేశీయ వినియోగదారుల రక్షణకు పెద్ద పీట వేస్తూ తమ కౌంటర్‌ఫీట్ క్రైమ్స్ యూనిట్‌ను (సీసీయూ) భారత్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో నకిలీ వస్తువుల విక్రయాలను అరికట్టడం, మేధోసంపత్తి హక్కులను కాపాడడం, మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడే ముఠాలను తుదముట్టించడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక విభాగం పనియచేయనుంది. ఈ యూనిట్ ద్వారా స్థానిక అమెజాన్ నిపుణుల సహకారంతో.. భారతీయ బ్రాండ్లు, విక్రేతలు, చట్టాల అమలు సంస్థలతో కలిసి నకిలీ ఉత్పత్తుల సరఫరాను అడ్డుకోనుంది.
ఇవి కూడా చదవండి
ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం.. నెతన్యాహుపై స్వదేశంలో విమర్శలు..
ఏబీఎన్ సిబ్బందికి బెదిరింపులు.. కాకాణిపై కేసు నమోదు