అమెజాన్ బజార్‌కు కీలకంగా తెలుగు రాష్ట్రాలు
ABN , Publish Date - May 13 , 2026 | 02:02 AM
అమెజాన్ బజార్ కు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కీలకంగా ఉన్నాయని, వార్షిక ప్రాతిపదికన ఈ రాష్ట్రాల నుంచి ఆర్డర్లు నాలుగు రెట్లు పెరిగాయని...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): అమెజాన్ బజార్ కు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కీలకంగా ఉన్నాయని, వార్షిక ప్రాతిపదికన ఈ రాష్ట్రాల నుంచి ఆర్డర్లు నాలుగు రెట్లు పెరిగాయని అమెజాన్ బజార్ హెడ్ సమీర్ లల్వానీ తెలిపారు. విమెన్స్ ఫ్యాషన్, హోమ్, కన్స్యూమర్ ఎలక్ర్టానిక్స్, యాక్సెసరీల వంటి విభాగాల్లో ఆర్డర్లు భారీగా పెరిగినట్టు చెప్పారు. అమెజాన్ బజార్‌లో మూడు కోట్ల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆర్డర్లలో హైదరాబాద్, విజయవాడ,గుంటూరు, విశాఖపట్నం, వరంగల్ ముందు వరుసలో ఉన్నాయని ఆయన తెలిపారు. ఏపీ, తెలంగాణ నుంచి అమెజాన్‌లో విక్రేతలు 75 వేల మంది ఉన్నారని, వీరిలో 1,200 మంది అమెజాన్ బజార్‌లో విక్రయాలు జరుపుతున్నారని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
ధరలను పెంచే యోచనలో ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు.. నిత్యావసరాలు మరింత ప్రియం
అంతర్జాతీయ అనిశ్చితులు.. పసిడి ధరల్లో కోత