Share News

లిథియం ఎనర్జీ స్టోరేజీ సొల్యూషన్లపై అమరరాజా ఫోకస్‌

ABN , Publish Date - Apr 22 , 2026 | 05:23 AM

టెలికాం రంగానికి 2 గిగావాట్‌ అవర్‌ (జీడబ్ల్యూహెచ్‌) సామర్థ్యం గల లిథియం అయాన్‌ స్టోరేజీ సొల్యూషన్లు అందించడంపై అమరరాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ దృష్టి సారించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా...

లిథియం ఎనర్జీ స్టోరేజీ సొల్యూషన్లపై అమరరాజా ఫోకస్‌

తెలంగాణ ప్లాంట్‌లో కొత్త యూనిట్‌ ఏర్పాటు

న్యూఢిల్లీ: టెలికాం రంగానికి 2 గిగావాట్‌ అవర్‌ (జీడబ్ల్యూహెచ్‌) సామర్థ్యం గల లిథియం అయాన్‌ స్టోరేజీ సొల్యూషన్లు అందించడంపై అమరరాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ దృష్టి సారించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 50 వేల సైట్లలో మొత్తం 1 గిగావాట్‌ అవర్‌ సొల్యూషన్ల సరఫరా కీలక మైలురాయిని కంపెనీ అధిగమించింది. ఇంధన స్టోరేజీ రంగానికి అవసరమైన యూపీఎస్‌, డేటా సెంటర్‌, కొత్త అప్లికేషన్లకు సంబంధించిన లిథియం అయాన్‌ సొల్యూషన్ల విభాగంలో ఒక కీలక మైలురాయిని చేరిన తాము తదుపరి మైలురాయిపై దృష్టి సారించినట్టు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ గౌరినేని తెలిపారు. ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్స్‌కు (ఈఎ్‌సఎస్‌) అవసరమైన పూర్తి ఇంటిగ్రేటెడ్‌ ప్యాక్‌లు, కంటైనర్ల తయారీ కోసం తెలంగాణలోని తమ దివిటిపల్లి ఫ్యాక్టరీలో ఒక కొత్త యూనిట్‌ ఏర్పాటు చేయనున్నట్టు ఆయన చెప్పారు. ఈ యూనిట్‌లో లిథియం అయాన్‌ బ్యాటరీల తయారీ, పరిశోధనా వసతుల ఏర్పాటుపై పదేళ్ల కాలంలో రూ.9,500 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్టు 2022 సంవత్సరంలోనే కంపెనీ ప్రకటించింది. తాము 1 జీడబ్ల్యూహెచ్‌ మైలురాయిని దాటడానికి రెండు, మూడేళ్లు పట్టిందని; కాని ఈ ఏడాదే దాన్ని రెట్టింపు చేసి 2 జీడబ్ల్యూహెచ్‌ దశను చేరాలన్నది తమ లక్ష్యమని అన్నారు.

వచ్చే వారమే శంకుస్థాపన: తెలంగాణలో తాము ఏర్పాటు చేయతలపెట్టిన కొత్త యూనిట్‌కు వచ్చే వారంలోనే శంకుస్థాపన చేయనున్నామని విక్రమ్‌ చెప్పారు. ఈ ఏడాది నవంబరు చివరి నాటికి ఈ యూనిట్‌లో ఉత్పత్తి ప్రారంభం అవుతుందన్నారు.

ఇవి కూడా చదవండి..

ఇరాన్‌తో చర్చలకు రమ్మంటే వస్తా: డొనాల్డ్ ట్రంప్

భారతీయ వీసా దరఖాస్తుదారులు.. గుడ్‌న్యూస్ చెప్పిన కెనడా..

Updated Date - Apr 22 , 2026 | 05:23 AM