హైదరాబాద్‌లో ఏఎంఐ ఏఐ ఫెసిలిటీ
ABN , Publish Date - Aug 26 , 2026 | 05:45 AM
పునరుత్పాదక ఇంధన రంగ సంస్థ గ్రీన్‌కో గ్రూప్ ప్రమోటర్లకు చెందిన కృత్రిమ మేధ మౌలిక వసతుల ప్లాట్‌ఫామ్...
9,000 ఎన్‌విడియా రుబిన్ జీపీయూలకు సంస్థ ఆర్డరు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): పునరుత్పాదక ఇంధన రంగ సంస్థ గ్రీన్‌కో గ్రూప్ ప్రమోటర్లకు చెందిన కృత్రిమ మేధ మౌలిక వసతుల ప్లాట్‌ఫామ్ ‘ఏఎం ఇంటెలిజెన్స్’ (ఏఎంఐ).. హైదరాబాద్‌లో తన తొలి ఏఐ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం కంపెనీ వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో డెలివరీ కోసం 9,000 ఎన్‌విడియా రుబిన్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ల (జీపీయూ)ను ఆర్డర్ చేసింది. ఎన్‌విడియాకు చెందిన అత్యాధునిక ఏఐ కంప్యూటింగ్ హార్డ్‌వేర్ ఉత్పత్తి ఇది. భారత్‌తో పాటు అమెరికా, ఫిన్లాండ్, మలేషియాలో మొత్తం 800 కోట్ల డాలర్ల (రూ.76,800 కోట్లు) పెట్టుబడులతో ఒక గిగావాట్ సామర్థ్యం కలిగిన ఏఐ కంప్యూటింగ్ కేంద్రాలను 2030 నాటికి ఏర్పాటు చేయాలని ఏఎంఐ లక్ష్యంగా పెట్టుకుంది. తొలివిడతగా హైదరాబాద్‌లో 30 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ ఫెసిలిటీని నిర్మిస్తోంది.
ఈ వార్తలనూ చదవండి:
ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్.. బ్రిక్స్ సదస్సుకు 400 మందితో భారీ బృందం..
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి సంబంధించిన అరుదైన వీడియో విడుదల!