యూపీలో ఏఎం గ్రూప్ కంప్యూట్ హబ్
ABN , Publish Date - Jan 21 , 2026 | 02:02 AM
ఏఎం గ్రూప్ తన కార్యకలాపాలను ఉత్తరప్రదేశ్‌కు విస్తరిస్తోంది. ఆ రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడా ప్రాంతంలో...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఏఎం గ్రూప్ తన కార్యకలాపాలను ఉత్తరప్రదేశ్‌కు విస్తరిస్తోంది. ఆ రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడా ప్రాంతంలో 1,000 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న హై పెర్‌ఫార్మెన్స్ కంప్యూట్ హబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో ఒక అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేసినట్లు తెలిపింది. దాదాపు 2,500 కోట్ల డాలర్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ ఏఐ ఇన్‌ఫ్రా హబ్ ప్రాజెక్టు మొదటి దశ 2028 నాటికి, తుది దశ 2030 నాటికి పూర్తవుతుందని ప్రకటించింది. హరిత ఇంధన రంగంలో ఉన్న గ్రీన్‌కో గ్రూప్ ప్రమోటర్లే ఏఎం గ్రూప్‌ను ప్రమోట్ చేశారు.
ఇవీ చదవండి:
భారత్ వృద్ధి రేటు 7.3 శాతం.. ఐఎమ్ఎఫ్ అంచనా
మార్కెట్‌ను ముంచిన టారిఫ్ భయాలు