జర్మనీకి అమ్మోనియా సరఫరా
ABN , Publish Date - Oct 01 , 2026 | 02:18 AM
గ్రీన్‌కో గ్రూప్‌నకు చెందిన ఏఎం గ్రీన్ అమ్మోనియా (ఇండియా).. జర్మనీకి చెందిన హింట్.కో జీఎంబీహెచ్ తాజాగా నిర్వహించిన హెచ్2 గ్లోబల్ ఆక్షన్‌లో...
హింట్.కోతో ఏఎం గ్రీన్ ఒప్పందం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): గ్రీన్‌కో గ్రూప్‌నకు చెందిన ఏఎం గ్రీన్ అమ్మోనియా (ఇండియా).. జర్మనీకి చెందిన హింట్.కో జీఎంబీహెచ్ తాజాగా నిర్వహించిన హెచ్2 గ్లోబల్ ఆక్షన్‌లో అమ్మోనియా సరఫరా కాంట్రాక్టును దక్కించుకుంది. ఈ మేరకు హింట్.కో జీఎంబీహెచ్‌తో ఏఎం గ్రీన్ దీర్ఘకాలిక సరఫరా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా పదేళ్ల పాటు హింట్.కో.. ఏఎం గ్రీన్ నుంచి అమ్మోనియాను కొనుగోలు చేయనుంది. ఈ ఆర్డర్ కనీస విలువ 58.5 కోట్ల యూరోలు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ ప్రాజెక్ట్ (ఫేజ్ 2)లో ఏఎం గ్రీన్ ఈ అమ్మోనియాను ఉత్పత్తి చేయనుంది. కాకినాడ పోర్టు ద్వారా ఈ అమ్మోనియాను జర్మనీకి పంపనుంది. 2029లో జర్మనీకి ఈ అమ్మోనియా సరఫరాలను ప్రారంభించాలని ఏఎం గ్రీన్ భావిస్తోంది.
ఈ వార్తలనూ చదవండి:
బంగారం యూటర్న్.. మరోసారి పెరిగిన ధరలు
‘జీ’ సుభాష్ చంద్ర రుణదాతలకు ఎన్‌సీఎల్‌ఏటీ నోటీసులు