ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలు పెంపు
ABN , Publish Date - Oct 08 , 2026 | 04:29 AM
టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్.. తన పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలను రూ.50 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది. అలాగే...
ఏడాదికి ఒకసారి ఉచిత అంతర్జాతీయ రోమింగ్ ఆఫర్
న్యూఢిల్లీ: టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్.. తన పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలను రూ.50 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది. అలాగే వినియోగదారులకు అదనపు ప్రయోజనాలను అందించేందుకు ప్లాన్లను సవరించినట్లు వెల్లడించింది. పెంచిన ధరలు బుధవారం నుంచే అమల్లోకి వచ్చాయని తెలిపింది. సవరించిన ప్లాన్లలో భాగంగా.. వినియోగదారలకు ఏటా ఒక అంతర్జాతీయ రోమింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొంది. సుమారు రూ.2,000 విలువైన ఈ ఉచిత రోమింగ్ ప్యాక్ ద్వారా 5 రోజుల వ్యాలిడిటీతో 5 జీబీ డేటా, 60 నిమిషాల టాక్‌టైమ్, 25 అవుట్‌గోయింగ్ ఎస్‌ఎంఎ్‌సలు, ఇన్‌కమింగ్ ఎస్‌ఎంఎ్‌సలు లభిస్తాయని తెలిపింది. ప్రస్తుతం ఉన్న పోస్ట్‌పెయిడ్ కస్టమర్లను నెలాఖరు లోగా తదుపరి ప్లాన్లకు మారుస్తామని, అపరిమిత డేటా, స్పామ్ రక్షణ, ఓటీటీ సబ్‌స్ర్కిప్షన్ ప్రయోజనాలు యధావిధిగా కొనసాగుతాయని ఎయిర్‌టెల్ స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి:
ఇకపై సెలక్షన్ కమిటీ భేటీలకు వీవీఎస్ లక్ష్మణ్: బీసీసీఐ
తీవ్ర విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు విద్యార్థుల మృతి