ఎయిర్‌టెల్ నుంచి 3 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు
ABN , Publish Date - Oct 19 , 2026 | 04:29 AM
టెలికాం కంపెనీలు రూటు మార్చాయి. మొబైల్ డేటా అవసరం లేకుండా కేవలం వాయిస్, ఎస్‌ఎంఎస్ సదుపాయం...
న్యూఢిల్లీ: టెలికాం కంపెనీలు రూటు మార్చాయి. మొబైల్ డేటా అవసరం లేకుండా కేవలం వాయిస్, ఎస్‌ఎంఎస్ సదుపాయం మాత్రమే కావాలనుకునే కస్టమర్ల కోసం ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్లు ప్రారంభించాయి. భారతి ఎయిర్‌టెల్ ఇందుకు నాంది పలికింది. ఇందులో భాగంగా రూ.185, రూ.203, రూ.206 టారి్‌ఫలతో మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు ప్రకటించింది. ఈ ప్లాన్ల కింద కస్టమర్లకు అపరిమిత వాయిస్, ఎస్‌టీడీ, రోమింగ్ కాల్స్‌తో పాటు 300 ఎస్‌ఎంఎ్‌సల సదుపాయాలు లభిస్తాయి. ఇందులో రూ.185 ప్లాను గడువు 28 రోజులు. రూ.203 ప్లాన్ గడువు నెల రోజులు. రూ.18 రీచార్జీతో ఈ ప్లాన్ గడువు మరో రెండు రోజులు పొడిగించుకోవచ్చు. నెల రోజుల పాటు చెల్లుబాటయ్యే రూ.206 ప్లాన్‌ను మాత్రం 30 రోజుల గడువు ముగిసిన వెంటనే నిర్ణీత తేదీన రెన్యువల్ చేయించుకోవాలి.
ఈ వార్తలనూ చదవండి:
జగన్ ఆదేశాల మేరకే పులివెందులలో వైసీపీ అరాచకం: టీడీపీ నేతలు
దసరా స్పెషల్ ట్రైన్లు.. ఛార్జీల పెంపుపై దక్షిణ మధ్య రైల్వే క్లారిటీ