Share News

వింగ్స్‌ ఇండియాలో ఎయిర్‌బస్‌ కొత్త విమానాలు

ABN , Publish Date - Jan 21 , 2026 | 01:55 AM

ఈ నెల 28 నుంచి 31 వరకు హైదరాబాద్‌లో జరిగే ‘వింగ్స్‌ ఇండి యా 2026 వైమానిక ప్రదర్శనలో ఎయిర్‌బస్‌..

వింగ్స్‌ ఇండియాలో ఎయిర్‌బస్‌ కొత్త విమానాలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఈ నెల 28 నుంచి 31 వరకు హైదరాబాద్‌లో జరిగే ‘వింగ్స్‌ ఇండి యా 2026 వైమానిక ప్రదర్శనలో ఎయిర్‌బస్‌.. తన సరికొత్త విమానాలు, హెలికాప్టర్లను ప్రదర్శించనుంది. ఈ ఎయిర్‌షోలో ఏ321 నియో, ఏ220 విమానాలతో పాటు హెచ్‌160 హెలికాప్టర్‌, అనేక అవసరాలకు ఉపయోగపడే హెచ్‌125 విమానాన్ని కూడా ప్రదర్శించబోతున్నట్టు తెలిపింది. ఇందులో హెచ్‌125 విమానాన్ని కంపెనీ భారత్‌లోనూ అసెంబుల్‌ చేస్తోంది. వీటితో పాటు వైమానిక రంగానికి సంబంధించి తమ సేవల వివరాలను కూడా తమ స్టాల్‌లో వివరించనున్నట్టు తెలిపింది.

ఇవీ చదవండి:

భారత్ వృద్ధి రేటు 7.3 శాతం.. ఐఎమ్ఎఫ్ అంచనా

మార్కెట్‌ను ముంచిన టారిఫ్‌ భయాలు

Updated Date - Jan 21 , 2026 | 05:53 AM