ఎయిర్ ప్యూరిఫైయర్స్‌కు పెరిగిన గిరాకీ
ABN , Publish Date - Nov 16 , 2026 | 02:02 AM
ఉత్తరాదిలోని ఢిల్లీ-ఎన్‌సీఆర్, దాని పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఎయిర్ ఫ్యూరిఫైయర్స్‌కు గిరాకీ పెరిగింది....
ఢిల్లీ సహా తెలంగాణ, మహారాష్ట్రల్లోనూ డిమాండ్
న్యూఢిల్లీ: ఉత్తరాదిలోని ఢిల్లీ-ఎన్‌సీఆర్, దాని పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఎయిర్ ఫ్యూరిఫైయర్స్‌కు గిరాకీ పెరిగింది. దీపావళి తర్వాత గాలి నాణ్యత క్షీణించడంతో ఎయిర్ ప్యూరిఫైయర్ల కోసం ఎంక్వైరీలు, కొనుగోళ్లు పెరిగాయని తయారీదారులు, రిటైలర్లు చెబుతున్నారు. గతంలో అగ్రశ్రేణి మెట్రోపాలిటన్ నగరాలకే పరిమితమైన ఎయిర్‌ప్యూరిఫైయర్ మార్కెట్ ఇప్పు డు దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించింది. ఇప్పటి వరకు ఢిల్లీలో ఎయిర్ ఫ్యూరిఫైయర్లకు భారీగా డిమాండ్ ఉండగా తాజాగా ఆ జాబితాలోకి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రా లు చేరిపోయాయి. 2025 వరకు మొత్తం అమ్మకాల్లో ఢిల్లీ-ఎన్‌సీఆర్ వాటా దాదాపు 80 శాతంగా ఉంది. కొత్త ప్రాంతాల చేరికతో వీటి అమ్మకాలు ఏకంగా నాలుగు రెట్లు పెరిగాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ఏటా ఈ మార్కెట్ 20 శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
మియామి ఎయిర్‌పోర్ట్‌లో రెండు విమానాల ఢీ.. ఇద్దరికి గాయాలు
చరిత్ర సృష్టించిన స్పేస్‌ఎక్స్.. గాల్లోనే స్టార్‌షిప్‌ను పట్టుకున్న స్టార్‌బేస్..