Share News

ఎయిరిండియా నష్టం రూ.22,238 కోట్లు

ABN , Publish Date - Sep 17 , 2026 | 03:31 AM

ఈ మార్చి 31తో ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో టాటా గ్రూప్‌ యాజమాన్యంలోని ఎయిరిండియా నష్టాలు...

ఎయిరిండియా నష్టం రూ.22,238 కోట్లు

న్యూఢిల్లీ: ఈ మార్చి 31తో ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో టాటా గ్రూప్‌ యాజమాన్యంలోని ఎయిరిండియా నష్టాలు భారీగా పెరిగి రూ. 22,238.23 కోట్లకు చేరాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (2024-25)లో నమోదైన రూ.10,858.83 కోట్ల నష్టంతో పోలిస్తే ఇది రెండింతలకు పైగా పెరగడం గమనార్హం. ఇదే సమయంలో కంపెనీ ఆదాయం కూడా రూ.78,635.61 కోట్ల నుంచి రూ. 71,869.94 కోట్లకు తగ్గింది. 2025 జూన్‌లో జరిగిన ఏఐ171 విమాన ప్రమాదం సంస్థపై తీవ్ర ప్రభావం చూపింది. దీనికి తోడు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, గగనతల ఆంక్షలు, విమాన మార్గాల మూసివేత, ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు కంపెనీ నష్టాలు పెరగడానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

Also Read:

భారత సినీ రంగానికి అనంత్ నాగ్‌ సేవలు స్ఫూర్తిదాయకం: పవన్ కల్యాణ్

రుణాల మంజూరుపై బ్యాంకులు దృష్టి పెట్టాలి: సీఎం చంద్రబాబు

Updated Date - Sep 17 , 2026 | 03:31 AM