‘ఏఐ’ ప్రయోజనాలు అందరికీ అందాలి
ABN , Publish Date - Jan 21 , 2026 | 02:07 AM
ప్రతి ఒక్కరి జీవితాలను మెరుగు పరచడమే కృత్రిమ మేధ (ఏఐ) లక్ష్యం కావాలని అంతర్జాతీయ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పష్టం చేశారు. దీని ప్రయోజనాలు...
లేకపోతే అదో గాలి బుడగే
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల
దావోస్ (స్విట్జర్లాండ్): ప్రతి ఒక్కరి జీవితాలను మెరుగు పరచడమే కృత్రిమ మేధ (ఏఐ) లక్ష్యం కావాలని అంతర్జాతీయ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పష్టం చేశారు. దీని ప్రయోజనాలు అందరికీ సమానంగా అందలాన్నారు. లేకపోతే అదో గాలి బుడగలా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఏఐ ప్రయోజనాలు కేవలం టెక్ కంపెనీలు, సరఫరాలకే పరిమితమైతే అదో చెప్పుడు కథలా మారుతుందన్నారు. స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న వార్షిక ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యుఈఎఫ్) సదస్సులో ఆయన ఈ విషయాలు స్పష్టం చేశారు. ఏఐ సాయంతో ఫార్మా కంపెనీలు కొత్త ఔషధాలు, ఔషధ పరీక్షలను ఎంత వేగంగా పూర్తి చేస్తాయనే విషయాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐ, ఇతర అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలతో ఉత్పాదకత పెరగడంతో పాటు పని విధానాలూ మారిపోతున్న విషయాన్ని నాదెళ్ల గుర్తు చేశారు.
ఇవీ చదవండి:
భారత్ వృద్ధి రేటు 7.3 శాతం.. ఐఎమ్ఎఫ్ అంచనా
మార్కెట్‌ను ముంచిన టారిఫ్ భయాలు