Share News

ఏఐ, ఆటోమేషన్‌.. ఇంజనీర్లను భర్తీ చేయలేవు

ABN , Publish Date - Nov 12 , 2026 | 03:58 AM

కృత్రిమ మేధ (ఏఐ), ఆటోమేషన్‌.. ఉత్పత్తి రంగ కంపెనీల్లో పనిచేసే క్వాలిటీ ఇంజనీర్లకు ఎలాంటి ముప్పులేదని...

ఏఐ, ఆటోమేషన్‌.. ఇంజనీర్లను భర్తీ చేయలేవు

క్వాలిజీల్‌ ఇండియా హెడ్‌ మధుమూర్తి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కృత్రిమ మేధ (ఏఐ), ఆటోమేషన్‌.. ఉత్పత్తి రంగ కంపెనీల్లో పనిచేసే క్వాలిటీ ఇంజనీర్లకు ఎలాంటి ముప్పులేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండు టెక్నాలజీలు వీరి పాత్రను భర్తీ చేయలేవని క్వాలిజీల్‌ సంస్థ ఇండియా ఆపరేషన్స్‌ హెడ్‌ మధుమూర్తి స్పష్టం చేశారు. ఏఐ, ఆటోమేషన్‌తో క్వాలిటీ ఇంజనీర్ల పాత్ర మరింత పెరిగి, వారు విశ్వసనీయ ఇంజనీర్లుగా మారతారన్నారు. అయితే ఏఐ ప్రవేశంతో క్వాలిటీ ఇంజనీరింగ్‌లోనూ భారీ మార్పులు చోటు చేసుకుంటున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఏఐ క్వాలిటీ ఇంజనీరింగ్‌లో ఒక అంతర్భాగంగా మారిందని మధుమూర్తి చెప్పారు. ఈ మార్పులో క్వాలిటీ ఇంజనీర్లు మరింత ముఖ్యమైన పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు.

ఇవి కూడా చదవండి:

న్యూజిలాండ్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అర్ష్‌దీప్ సింగ్!

కోహ్లీని ఇంటర్వ్యూ చేసిన ఆర్యవీర్ సెహ్వాగ్.. ఈ వైరల్ వీడియో చూశారా?

Updated Date - Nov 12 , 2026 | 03:58 AM