సెబీతో అదానీ మరో కేసు సెటిల్
ABN , Publish Date - Sep 29 , 2026 | 05:05 AM
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, నాలుగు అదానీ కంపెనీతో పాటు మరో 13 మంది కలిసి కనీస పబ్లిక్ షేర్‌హోల్డింగ్ (ఎంపీఎస్) నిబంధనల ఉల్లంఘన కేసును...
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, నాలుగు అదానీ కంపెనీతో పాటు మరో 13 మంది కలిసి కనీస పబ్లిక్ షేర్‌హోల్డింగ్ (ఎంపీఎస్) నిబంధనల ఉల్లంఘన కేసును సెబీకి రూ.1.48 కోట్లు చెల్లించి పరిష్కరించుకున్నారు. ఈ కేసును సెటిల్ చేసుకున్న జాబితాలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పవర్, అదానీ పోర్ట్స్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌తో పాటు వాటి డైరెక్టర్లు, మరికొంత మంది ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. అదానీ గ్రూప్‌నకు చెందిన కొన్ని లిస్టెడ్ కంపెనీలు ఎంపీఎస్ నిబంధనలను ఉల్లంఘించాయని 2020 జూన్-జూలైలో వచ్చిన ఆరోపణలకు సంబంధించిన కేసు ఇది. గత వారంలో ఐదు అదానీ కంపెనీలు మరో కేసుకు సంబంధించి సెబీకి రూ.1.5 కోట్లు చెల్లించి సెటిల్‌మెంట్ చేసుకున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
ఆసియా క్రీడల్లో ఈషా సింగ్‌కు వెండి పతకం.. సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లుగా గెజిట్ నోటిఫికేషన్..