Share News

సెబీతో అదానీ సెటిల్‌మెంట్‌

ABN , Publish Date - Sep 23 , 2026 | 04:38 AM

అదానీ గ్రూపునకు మరో పెద్ద ఊరట లభించింది. గ్రూపు షేర్లలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని, అదానీ కంపెనీలు సంబంధిత పార్టీలతో...

సెబీతో అదానీ సెటిల్‌మెంట్‌

రూ.1.5 కోట్ల చెల్లింపులకు అంగీకారం

  • అదానీ-హిండెన్‌బర్గ్‌ కథ ఇక కంచికి!

న్యూఢిల్లీ: అదానీ గ్రూపునకు మరో పెద్ద ఊరట లభించింది. గ్రూపు షేర్లలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని, అదానీ కంపెనీలు సంబంధిత పార్టీలతో లావాదేవీలకు సంబంధించిన కీలక సమాచారాన్ని కూడా వెల్లడించకుండా నిబంధనలను అతిక్రమించాయంటూ అమెరికా హెడ్జ్‌ ఫండ్‌ హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణల నుంచి పూర్తి విముక్తి లభించింది. సంబంధిత పార్టీలతో లావాదేవీల సమాచార వెల్లడిలో నిబంధనల అతిక్రమణల ఆరోపణలపై జరిపిన దర్యాప్తులో భాగంగా సెబీ తీసుకునే న్యాయపరమైన చర్యల నుంచి అదానీ గ్రూపు పూర్తిగా తప్పించుకుంది. ఇందుకోసం అదానీకి చెందిన ఐదు కంపెనీలు సెబీకి రూ.1.5 కోట్లు చెల్లించి ఈ వ్యవహారాన్ని సెటిల్‌ చేసుకున్నాయి. ఇంతకు ముందు అమెరికా సెక్యూరిటీస్‌ ఎక్ఛేంజ్‌ కమిషన్‌ (ఎ్‌సఈసీ)తోనూ అదానీ గ్రూపు ఇలాగే సెటిల్‌ చేసుకుంది. కార్పొరేట్‌ కంపెనీలపై వచ్చే ఆరోపణలపై సెబీ లాంటి నియంత్రణ సంస్థలు దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటాయి. అయితే, నియంత్రణ సంస్థలు చర్యలు తీసుకోక ముందే, కంపెనీలు కొంత మొత్తాన్ని చెల్లించి ఆ విషయానికి ఫుల్‌స్టాప్‌ పెట్టవచ్చు. ఇందుకోసం తనపై వచ్చిన ఆరోపణలను ఒప్పుకోవడంగానీ, తిరస్కరించడంగానీ చేయనవసరం లేదు. దీన్నే సెటిల్‌మెంట్‌ అంటారు.

2023 జనవరిలో అమెరికా హెడ్జ్‌ ఫండ్‌ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌.. అదానీ గ్రూపుపై చేసిన ఆరోపణలు ఆ గ్రూపు కంపెనీల షేర్లను నేలమట్టం చేశాయి. గ్రూపు ప్రధాన ప్రమోటర్‌ గౌతం అదానీ తన సన్నిహిత బంధువుల ద్వారా గ్రూపులోని ఐదు లిస్టెడ్‌ కంపెనీల షేర్లలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరుపుతున్నారని హిండెన్‌బర్గ్‌ ఆరోపించింది. దీనిపై సెబీతో సహా అనేక సంస్థలు దర్యాప్తు చేసినా, చివరికి పెద్దగా ఏమీ తేల్చలేదు. ఈ దర్యాప్తులు కూడా అదానీలను రక్షించేందుకు తూతూ మంత్రంగానే జరిగాయని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. తాజా సెటిల్‌మెంట్‌ ఈ అనుమానాలకు బలం చేకూర్చేలా ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి..

రాజధాని అమరావతి పనులకు ఆటంకాలు లేకుండా వేగం పెంచాలి: నారాయణ

ఆసియా క్రీడల్లో స్వర్ణం.. కమలినికి తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా

Updated Date - Sep 23 , 2026 | 04:38 AM