ఏపీలో భారీ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టు
ABN , Publish Date - Jul 25 , 2026 | 01:58 AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అదానీ గ్రూప్ సంస్థ.. అదానీ ఎనర్జీ సొల్యూషన్ లిమిటెడ్ (ఏఈఎ్‌సఎల్) కు భారీ ప్రాజెక్టు లభించింది. ఈ ప్రాజెక్టు కింద విశాఖపట్నం ప్రాంతంలో..
ప్రాజెక్టు విలువ రూ.8,500 కోట్లు
అదానీ ఎనర్జీ సొల్యూషన్స్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అదానీ గ్రూప్ సంస్థ.. అదానీ ఎనర్జీ సొల్యూషన్ లిమిటెడ్ (ఏఈఎ్‌సఎల్) కు భారీ ప్రాజెక్టు లభించింది. ఈ ప్రాజెక్టు కింద విశాఖపట్నం ప్రాంతంలో ఏర్పాటయ్యే హరిత అమ్మోనియా, హైడ్రోజన్ ప్రాజెక్టులకు అవసరమయ్యే సమగ్ర విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏఈఎ్‌సఎల్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు విలువ రూ.8,500 కోట్ల వరకు ఉంటుందని ఏఈఎ్‌సఎల్ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరిగిన పోటీ బిడ్డింగ్‌లో పాల్గొని ఈ ప్రాజెక్టు దక్కించుకున్నట్టు ఏఈఎ్‌సఎల్ తెలిపింది.
లోడింగ్ సమస్యకూ పరిష్కారం: ఈ ప్రాజెక్టు ద్వారా పెందుర్తి-వైజాగ్ ప్రాంతంలో ఎదురవుతున్న లోడ్ సమస్య కూడా తీరుతుందని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో పెద్దఎత్తున డేటా కేంద్రాలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు ఏర్పాటవుతున్నాయి. ఏఈఎ్‌సఎల్ ఏర్పాటు చేసే విద్యుత్ సరఫరా లైన్.. పెరుగుతున్న ఈ ప్రాంత విద్యుత్ అవసరాలను కూడా తీరుస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు వైజాగ్ పవర్ ట్రాన్సిమిషన్ లిమిటెడ్’ పేరుతో ప్రత్యేక అనుబంధ కంపెనీని కూడా ఏర్పాటు చేసినట్టు ఏఈఎ్‌సఎల్ తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి:
క్వాంటం వ్యాలీలో మరో కీలక ప్రాజెక్టు