Share News

అదానీ ఎయిర్‌పోర్ట్స్‌ రూ.9,825 కోట్లు సమీకరణ

ABN , Publish Date - Sep 10 , 2026 | 01:52 AM

భారత కుబేరుడు గౌతమ్‌ అదానీకి చెందిన ఎయిర్‌పోర్ట్‌ కంపెనీ అదానీ ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (ఏఏహెచ్‌ఎల్‌) తన...

అదానీ ఎయిర్‌పోర్ట్స్‌ రూ.9,825 కోట్లు సమీకరణ

మూడో అత్యంత విలువైన ఎయిర్‌పోర్ట్‌ ఆపరేటర్‌గా అవతరణ!

న్యూఢిల్లీ: భారత కుబేరుడు గౌతమ్‌ అదానీకి చెందిన ఎయిర్‌పోర్ట్‌ కంపెనీ అదానీ ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (ఏఏహెచ్‌ఎల్‌) తన వ్యాపార విస్తరణ కోసం భారీ ఎత్తున నిధులు సమీకరించనుంది. అల్ఫా వేవ్‌ గ్లోబల్‌, టెమాసెక్‌, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌, బ్లాక్‌రాక్‌ నిర్వహించే ఫండ్స్‌తో సహా అంతర్జాతీయ, దేశీయ ఇన్వెస్టర్ల కన్సార్షియం నుంచి దాదాపు 100 కోట్ల డాలర్లు (రూ.9,825 కోట్లు) సమీకరించనుంది. ఈ పెట్టుబడికి ముందు ఏఏహెచ్‌ఎల్‌ విలువను దాదాపు 1,800 కోట్ల డాలర్లుగా లెక్కగట్టారు. కొత్త పెట్టుబడితో ఈక్విటీ విలువ సుమారు 1,900 కోట్ల డాలర్లకు చేరుతుంది. తద్వారా స్పెయిన్‌కు చెందిన ఏనా, ఎయిర్‌పోర్ట్స్‌ ఆఫ్‌ థాయ్‌లాండ్‌ తర్వాత ప్రపంచంలోనే ప్రధాన ఎయిర్‌పోర్ట్‌ ఆపరేటర్లలో అదానీ ఎయిర్‌పోర్ట్స్‌ మూడో స్థానంలో నిలిచే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి..

ఎస్-400, ఎస్‌యు-57, బ్రహ్మోస్‌పై భారత్‌ ఫోకస్.. మోదీ-పుతిన్ భేటీలో కీలక చర్చలు..

మరో పదేళ్లలో మనుషుల్ని ఏఐ చంపేయొచ్చు.. ఆంత్రోపిక్‌ పరిశోధకుడి సంచలన హెచ్చరిక..

Updated Date - Sep 10 , 2026 | 01:54 AM