Share News

‘ఏసీ’లకు రూపాయి, కాపర్‌ పోటు

ABN , Publish Date - Mar 09 , 2026 | 01:31 AM

దేశంలో ఎండలతో పాటు ఎయిర్‌ కండీషనర్స్‌ (ఏసీ) ధరలూ చుక్కలంటుతున్నాయి. బ్లూస్టార్‌, ఎల్‌జీ ఎలకా్ట్రనిక్స్‌ ఇండియా, హాయర్‌ ఇండియా, మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్‌ కంపెనీలు...

‘ఏసీ’లకు రూపాయి, కాపర్‌ పోటు

15% వరకు పెరగనున్న ధర.. జీఎ్‌సటీ ప్రయోజనాలు హాంఫట్‌

న్యూఢిల్లీ: దేశంలో ఎండలతో పాటు ఎయిర్‌ కండీషనర్స్‌ (ఏసీ) ధరలూ చుక్కలంటుతున్నాయి. బ్లూస్టార్‌, ఎల్‌జీ ఎలకా్ట్రనిక్స్‌ ఇండియా, హాయర్‌ ఇండియా, మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్‌ కంపెనీలు ఇప్పటికే తమ రూమ్‌ ఏసీల ధరలను 5 నుంచి 10 శాతం వరకు పెంచేశాయి. ఫిబ్రవరి నెల నుంచే ఈ పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి. తాజాగా డైకిన్‌ ఇండియా, వోల్టాస్‌ కంపెనీలు కూడా త్వరలోనే తమ ఏసీల ధరలను 12 నుంచి 15 శాతం పెంచబోతున్నట్టు ప్రకటించాయి. ఏప్రిల్‌ నుంచి ఈ ధరల పెంపు ఉంటుందని డైకిన్‌ ఇండియా వెల్లడించింది. దీంతో గత ఏడాది సెప్టెంబరులో ఎయిర్‌ కండీషనర్స్‌ (ఏసీ)పై 28 నుంచి 18 శాతానికి తగ్గిన జీఎస్‌టీ 2.0 ప్రయోజనాలు తుడిచి పెట్టుకుపోయాయి.

ఎందుకంటే?

గత ఏడాదితో పోలిస్తే ఏసీల తయారీలో ప్రధాన ముడి పదార్ధాలైన రాగి, అల్యూమినియం ధరలు భారీగా పెరిగి పోయాయి. డాలర్‌తో రూపాయి మారకం రేటూ బక్కచిక్కి పోయింది. దీంతో ఏసీల తయారీలో ఉపయోగించే కీలక పరికరాల దిగుమతుల ధర, రవాణ ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ఇవి చాలవన్నట్టు ఈ ఏడాది జనవరి నుంచి దేశంలో తయారయ్యే 5 స్టార్‌ ఏసీల ఇంధన సామర్ధ్యం కనీసం 10 శాతం పెరగాలని బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫీషియెన్సీ (బీఈఈ) నిర్దేశించింది. దీంతో ఽధరలు పెంచక తప్పడం లేదని డైకిన్‌ ఇండియా సీఎండీ కన్వల్‌ జీత్‌ జావా చెప్పారు.


అమ్మకాలకు ఢోకా ఉండదు

ధరలు పెంచినా ఈ వేసవిలో దేశంలో రూమ్‌ ఏసీల అమ్మకాలకు ఢోకా ఉండకపోవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఏడాది ఎండలు 2024 స్థాయిని మించిపోతాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. దీంతో ప్రస్తుతం ఏసీలు కొనే వారిలో ఎక్కువ మంది కొత్త 5 స్టార్‌ ఏసీలు కొనేందుకే మొగ్గు చూపుతున్నారు. బీఈఈ నిర్దేశించిన ప్రమాణాలతో ఈ కొత్త ఫైవ్‌ స్టార్‌ ఏసీల ఇంధన సామర్ద్యం కనీసం 10 శాతం పెరగనుంది. పెరిగిన ఏసీల ధరల భారాన్ని ఈ ఇంధన పొదుపు చాలా వరకు భర్తీ చేస్తుందని పరిశ్రమ వర్గాల అంచనా. ఎలా చూసినా ఈ ఏడాది వేసవిలో దేశంలో రూమ్‌ ఏసీల అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే కనీసం 15 శాతం పెరుగుతాయని ఆశిస్తున్నట్టు హాయర్‌ ఇండియా ప్రెసిడెంట్‌ ఎన్‌ఎ్‌స సతీష్‌ చెప్పారు.

ఈ వార్తలూ చదవండి:

బొగ్గులా నల్లగా దోశ.. రెస్టారెంట్ ప్రయోగం వైరల్

కుటుంబంతో సహా వచ్చి గర్ల్‌ఫ్రెండ్ ఇంటి ముందు వ్యక్తి డ్యాన్స్! ఎందుకో తెలిస్తే..

Updated Date - Mar 09 , 2026 | 01:32 AM