Share News

రూ.100 కోట్ల టర్నోవర్‌ లక్ష్యం: అభి ఎగ్స్‌

ABN , Publish Date - Feb 06 , 2026 | 04:52 AM

అభి ఫుడ్స్‌ ఎగ్‌ బ్రాండ్‌.. అభి ఎగ్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గడచిన ఆర్థిక సంవత్సరం (2024-25)లో కంపెనీ టర్నోవర్‌...

రూ.100 కోట్ల టర్నోవర్‌ లక్ష్యం: అభి ఎగ్స్‌

అభి ఫుడ్స్‌ ఎగ్‌ బ్రాండ్‌.. అభి ఎగ్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గడచిన ఆర్థిక సంవత్సరం (2024-25)లో కంపెనీ టర్నోవర్‌ రూ.47.47 కోట్లుగా ఉందని కార్యకలాపాల విస్తరణ, కొత్త మార్కెట్లలోకి ప్రవేశించటం ద్వారా నిర్ధేశిత లక్ష్యాన్ని అందుకోవచ్చని భావిస్తున్నట్లు అభి ఎగ్స్‌ సహ వ్యవస్థాపకుడు ఎస్‌వీవీ దొరా రెడ్డి తెలిపారు. అలాగే పశ్చిమాసియా, ఆగ్నేయాసియా దేశాలకు కార్యకాపాలను విస్తరించాలని చూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని రావులపాలెంలోని పౌలీ్ట్ర ఫామ్స్‌లో ప్రత్యేక పోషక విలువలున్న గుడ్లను ఉత్పత్తి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం కంపెనీ రోజువారీ గుడ్ల ఉత్పత్తి సామర్థ్యం 18-20 లక్షలుగా ఉందని వివరించారు.

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌)

ఇవి కూడా చదవండి..

భారత్‌కు ఆ స్వేచ్ఛ ఉంది.. ఏ దేశం నుంచైనా చమురు కొనొచ్చు: రష్యా అధికార ప్రతినిధి

బంగారం, వెండి ముందుకే.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Feb 06 , 2026 | 04:52 AM