Share News

ఏబీడీ మాస్ట్రో రూ.70 కోట్ల పెట్టుబడి

ABN , Publish Date - Jul 18 , 2026 | 05:45 AM

అల్లైడ్‌ బ్లెండర్స్‌ అండ్‌ డిస్టిలరీస్‌ లిమిటెడ్‌ అనుబంధ సంస్థ ఏబీడీ మాస్ట్రో.. మార్కెట్లోకి...

ఏబీడీ మాస్ట్రో  రూ.70 కోట్ల పెట్టుబడి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అల్లైడ్‌ బ్లెండర్స్‌ అండ్‌ డిస్టిలరీస్‌ లిమిటెడ్‌ అనుబంధ సంస్థ ఏబీడీ మాస్ట్రో.. మార్కెట్లోకి మూడు సరికొత్త ప్రీమియం ఉత్పత్తులను తీసుకువచ్చింది. ఐరిష్‌ విస్కీ ఔథ్‌తో పాటు వుడ్‌బర్న్స్‌, యెల్లో డిజైనర్‌ బ్రాండ్లతో వీటిని తీసుకువచ్చినట్లు సంస్థ ఎండీ బిక్రమ్‌ బసు తెలిపారు. ఈ ఉత్పత్తుల కోసం కంపెనీ రూ.70 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టిందని ఆయన చెప్పారు. కాగా కంపెనీలో బాలీవుడ్‌ నటుడు రణవీర్‌ సింగ్‌కు 20 శాతం వాటా ఉందని ఆయన తెలిపారు. కొత్త ఉత్పత్తులతో వచ్చే ఐదేళ్లలో 10 శాతం మార్కెట్‌ వాటాను దక్కించుకోవచ్చని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి

మూగజీవాలకు అపన్నహస్తం..

తప్పిపోయిన 35 ఏళ్ల తర్వాత.. అమ్మకు దగ్గరైన కూతురు

Updated Date - Jul 18 , 2026 | 05:45 AM