Share News

విస్తరణ బాటలో ఏబీబీ ఇండియా

ABN , Publish Date - Mar 10 , 2026 | 02:01 AM

ఎలక్ట్రిఫికేషన్‌, ఆటోమేషన్‌ సంస్థ ‘ఏబీబీ’ మేకిన్‌ ఇండియా బాటపట్టింది. ఇందులో భాగంగా భారత్‌లో తన ఉత్పత్తి సామర్థ్యాలను మరింతగా విస్తరించటంతో పాటు...

విస్తరణ బాటలో ఏబీబీ ఇండియా

హైదరాబాద్‌లో కొత్త ఆర్‌ అండ్‌ డీ ల్యాబ్‌

న్యూఢిల్లీ: ఎలక్ట్రిఫికేషన్‌, ఆటోమేషన్‌ సంస్థ ‘ఏబీబీ’ మేకిన్‌ ఇండియా బాటపట్టింది. ఇందులో భాగంగా భారత్‌లో తన ఉత్పత్తి సామర్థ్యాలను మరింతగా విస్తరించటంతో పాటు హైదరాబాద్‌, బెంగళూరు నగరాల్లో అధునాతన పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ) కేంద్రాలు, టెస్టింగ్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ఈ సంవత్సరం 7.5 కోట్ల డాలర్లు (సుమారు రూ.690 కోట్లు) ఖర్చు చేయబోతున్నట్టు తెలిపింది. ఉత్పత్తి సామర్ధ్య విస్తరణలో భాగంగా కీలకమైన విద్యుదీకరణ, ఆటోమేషన్‌ సొల్యూషన్స్‌, పునరుత్సాదక ఇంధన ప్రాజెక్టులు, మెట్రో రైల్‌, డేటా కేంద్రాలకు అవసరమైన కీలక యంత్ర పరికరాలు, సొల్యూషన్స్‌ సామర్ధ్యాన్ని విస్తరిస్తోంది. భారత్‌లో కంపెనీ విక్రయించే యంత్రపరికరాల్లో ఇప్పటికే దాదాపు 85 శాతం ఉత్పత్తులను స్థానికంగానే ఉత్పత్తి చేస్తున్నట్టు ఏబీబీ ఇండియా తెలిపింది. హైదరాబాద్‌తో పాటు బెంగళూరులోనూ సరికొత్త ఆర్‌ అండ్‌ డీ, టెస్టింగ్‌ ల్యాబ్‌లను ఈ ఏడాది ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపింది.

ఇవి కూడా చదవండి:

ఇది 1.4 బిలియన్ల భారతీయుల ప్లాన్.. ఎక్స్‌లో గౌతీ

పాకిస్థాన్‌కు వరుణ్ చక్రవర్తి సెటైర్.. మరోసారి టీ కప్పుతో ట్రోలింగ్

Updated Date - Mar 10 , 2026 | 02:01 AM