Share News

30 రోజుల ప్లాన్లను ప్రమోట్‌ చేయండి..

ABN , Publish Date - Mar 25 , 2026 | 05:53 AM

మొబైల్‌ ప్రీ-పెయిడ్‌ పథకాల్లో 30 రోజుల గడువు ప్లాన్లకు అధిక ప్రచారం కల్పించాలని టెలికాం కంపెనీలను కేంద్ర ప్రభుత్వం కోరింది. ప్రస్తుతం టెలికాం కంపెనీలు...

30 రోజుల ప్లాన్లను ప్రమోట్‌ చేయండి..

టెలికాం కంపెనీలను కోరిన కేంద్రం

న్యూఢిల్లీ: మొబైల్‌ ప్రీ-పెయిడ్‌ పథకాల్లో 30 రోజుల గడువు ప్లాన్లకు అధిక ప్రచారం కల్పించాలని టెలికాం కంపెనీలను కేంద్ర ప్రభుత్వం కోరింది. ప్రస్తుతం టెలికాం కంపెనీలు మంత్లీ రీచార్జ్‌ పథకాల ముసుగులో 28 రోజుల గడువు ప్లాన్లను అధికంగా ప్రమోట్‌ చేస్తున్న అంశాన్ని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఎంపీ రాఘవ్‌ చద్దా ఈ మధ్యనే పార్లమెంట్‌లో లేవనెత్తారు. దీంతో మొబైల్‌ వినియోగదారులు ఏడాదిలో 13 సార్లు రీచార్జ్‌ చేసుకోవాల్సి వస్తోందన్నారు. ఈ నేపథ్యంలో 30 రోజుల ప్లాన్లపై వినియోగదారుల్లో అవగాహన పెంచాలని, వన్‌టైమ్‌, కస్టమైజ్డ్‌ ప్లాన్లలోనూ 30 రోజుల గడువు ఆప్షన్‌ను కల్పించాలని టెలికాం కంపెనీలను కోరినట్లు కేంద్ర సమాచార, టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.

రూ. 10,189 కోట్లతో మారుతి కొత్త ప్లాంట్‌

న్యూఢిల్లీ: దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ).. గుజరాత్‌లో రూ.10,189 కోట్లతో కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఖోరజ్‌ ఇండ స్ట్రియల్‌ ఎస్టేట్‌లో ఈ ప్లాంట్‌ను నిర్మించనున్నట్లు తెలిపింది. తొలి దశలో ఏటా 2.5 లక్షల కార్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. 2029 నాటికి ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభించాలని మారుతి సుజుకీ లక్ష్యంగా పెట్టుకుంది.

ఇవీ చదవండి:

యుద్ధంతో ఇంధన సంక్షోభం, భారత్‌పైనా ఆ ప్రబావం ఉంది: మోదీ

క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Updated Date - Mar 25 , 2026 | 05:54 AM