Share News

2032 నాటికి 100 హెలీకాప్టర్లు

ABN , Publish Date - Jan 29 , 2026 | 06:29 AM

విమానాలు, హెలీకాప్టర్లను వివిధ సంస్థలకు లీజుకు ఇచ్చే స్కైపల్స్‌ సొల్యూషన్స్‌ ఐఎ ఫ్‌ఎ్‌ససీ లిమిటెడ్‌ తన కార్యకాలపాలను భారీగా...

2032 నాటికి 100 హెలీకాప్టర్లు

రూ.3,000 కోట్ల పెట్టుబడి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): విమానాలు, హెలీకాప్టర్లను వివిధ సంస్థలకు లీజుకు ఇచ్చే స్కైపల్స్‌ సొల్యూషన్స్‌ ఐఎ ఫ్‌ఎ్‌ససీ లిమిటెడ్‌ తన కార్యకాలపాలను భారీగా విస్తరిస్తోంది. కంపెనీ ప్రస్తుతం ఎనిమిది హెలికాప్టర్లు, రెండు విమానాలను వివిధ సంస్థలకు లీజుకు ఇచ్చింది. 2032 నాటికి లీజుకు ఇచ్చే హెలికాప్టర్ల సంఖ్యను 100కు పెంచనున్నట్టు కంపెనీ వ్యవస్థాపకులు శశాంక్‌ సింఘాల చెప్పారు. ఇందుకోసం దాదాపు రూ.3,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు తెలిపారు. ఈ నిధులు సమకూర్చేందుకు అనేక అంతర్జాతీయ సంస్థలు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. విమానాలు, హెలీకాప్టర్లను లీజుకు ఇస్తున్న తొలి భారతీయ కంపెనీ తమదేనని శశాంక్‌ చెప్పారు.

తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలపై స్కైపల్స్‌ సొల్యూషన్‌ ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యంగా జాతీయ రహదారులపై జరిగే ప్రమాదాల్లో గాయపడే వారిని వేగంగా ఆస్పత్రులకు తరలించి అత్యవసర వైద్య సాయం అందించే సంస్థలకు తన హెలీకాప్టర్లను లీజుకు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక హెలీకాప్టర్‌ను అందుబాటులో ఉంచడం తమ లక్ష్యమని ఆయన చెప్పారు. ఈ ప్రతిపాదనపై రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు అత్యంత ఆసక్తి చూపిస్తున్నట్టు శశాంక్‌ చెప్పారు.

ఇవీ చదవండి:

ఈయూతో వాణిజ్య ఒప్పందం.. ఫార్మాకు లాభం.. ఆటోకు కష్టం

నార్త్ బ్లాక్‌లో బడ్జెట్ హల్వా వేడుక.. వారంతా ఐదు రోజుల పాటు అక్కడే..

Updated Date - Jan 29 , 2026 | 06:29 AM