Share News

ఇల్లు కొనాలని చూస్తున్నారా? అయితే ఇవి గుర్తుంచుకోండి.!

ABN , Publish Date - Feb 21 , 2026 | 04:25 PM

ఇల్లు కొనాలని చూస్తున్నారా? అయితే కొనుగోలు చేసే ముందు కొన్ని ముఖ్యమైన వాస్తు నియమాలను తప్పనిసరిగా పాటించాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు..

ఇల్లు కొనాలని చూస్తున్నారా? అయితే ఇవి గుర్తుంచుకోండి.!
Vastu Tips for Buying House

ఇంటర్నెట్ డెస్క్: ఇల్లు కొనడం జీవితంలో ఒక పెద్ద నిర్ణయం. చాలా మంది ఈ నిర్ణయం తీసుకునే ముందు వాస్తు శాస్త్రాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. వాస్తు ప్రకారం సరైన ప్రదేశాన్ని ఎంచుకుంటే.. కుటుంబానికి శాంతి, ఆరోగ్యం, ఆర్థికాభివృద్ధి కలుగుతుందని నమ్మకం. అందుకే ఇల్లు కొనేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.


చెత్త కుప్పలు ఉండకూడదు..

ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం. చెత్త కుప్పలు లేదా అపరిశుభ్రమైన ప్రదేశాలు ఉంటే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. వాస్తు ప్రకారం కూడా ఇలాంటి ప్రదేశాలు ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తాయని చెబుతారు. అందువల్ల ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉండడం ముఖ్యం.

పాడుబడిన బావులు లేదా గుంతలు ఉండకూడదు..

ఇంటి దగ్గర పాడుబడిన బావి, పెద్ద గుంత లేదా లోతట్టు ప్రదేశం ఉండటం ఆర్థిక సమస్యలకు కారణమవుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇది ఇంటి శక్తి సమతుల్యతను దెబ్బతీస్తుందట. కాబట్టి ఇల్లు కొనేముందు పరిసరాలను జాగ్రత్తగా పరిశీలించాలి.


ఇంటి దగ్గర శ్మశానం ఉండకూడదు..

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి సమీపంలో శ్మశానం ఉండటం మంచిది కాదు. అలాంటి ప్రదేశాల్లో ప్రతికూల శక్తులు ఉంటాయని నమ్ముతారు. ఇది ఇంటి వాతావరణంపై ప్రభావం చూపి, కుటుంబ సభ్యుల మానసిక ప్రశాంతతను తగ్గించవచ్చు.

ఉత్తర దిశలో కొండ లేదా అడ్డంకి ఉండకూడదు..

వాస్తు ప్రకారం ఇంటికి ఉత్తర దిశ సంపద, అభివృద్ధికి సూచికగా భావిస్తారు. ఆ దిశలో కొండ లేదా పెద్ద అడ్డంకి ఉంటే సానుకూల శక్తి ప్రవాహం తగ్గుతుందని నమ్ముతారు. అందువల్ల ఉత్తర దిశ ఖాళీగా లేదా తక్కువ అడ్డంకులతో ఉండటం మంచిది.

ఇతర ముఖ్యమైన విషయాలు..

వాస్తు మాత్రమే కాకుండా.. ఇల్లు కొనేటప్పుడు భద్రత, తాగునీటి సౌకర్యం, విద్యుత్, రోడ్డు సౌకర్యం, చట్టపరమైన పత్రాలు సక్రమంగా ఉన్నాయా లేదా అనేది కూడా తప్పనిసరిగా చూసుకోవాలి. అన్ని విషయాలనూ పరిశీలించి సరైన నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

యువతలో బీపీ పెరగడానికి కారణం తెలుసా?

పాదాలలో ఈ 4 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!

For More Latest News

Updated Date - Feb 21 , 2026 | 04:54 PM