ఆగస్టులో ఈ రాశుల వారికి అదృష్ట యోగం.. లక్ష్మీదేవి కటాక్షంతో ధనలాభం!
ABN , Publish Date - Aug 04 , 2026 | 02:50 PM
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల సంచారం ప్రతి నెలా కొన్ని రాశులపై ప్రత్యేక ప్రభావం చూపుతుందని నమ్ముతారు. 2026 ఆగస్టు నెలలో గ్రహాల స్థాన మార్పుల కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వచ్చే సూచనలు ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జాతకంలో 9వ స్థానాన్ని అదృష్ట స్థానంగా భావిస్తారు. ఈ స్థానంపై శుభ గ్రహాల ప్రభావం ఉంటే వ్యక్తి జీవితంలో మంచి మార్పులు వస్తాయని నమ్మకం. 2026 ఆగస్టు నెలలో గ్రహాల సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితంలో శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు.
మేష రాశి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఆగస్టు నెలలో గురు గ్రహం నాలుగో స్థానంలో ఉండి దశమ స్థానాన్ని వీక్షిస్తున్నాడు. దీంతో ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులతో పాటు వ్యక్తిగత సమస్యలు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి.
వృషభ రాశి
శని గ్రహం లాభ స్థానంలో సంచరిస్తుండటంతో ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అలాగే ఇల్లు లేదా స్థలం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది అనుకూల సమయంగా భావిస్తున్నారు.
కర్కాటక రాశి
గురు గ్రహం కర్కాటక రాశిలో సంచరిస్తుండటంతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావచ్చు. వ్యాపారంలో లాభాలు పెరిగే సూచనలు ఉన్నాయి. ఆకస్మిక ధనలాభం కూడా కలిగే అవకాశం ఉండటంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
సింహ రాశి
కుజుడు సెప్టెంబర్ రెండో వారం వరకు లాభ స్థానంలో సంచరిస్తుండటంతో సింహ రాశి వారికి శుభ ఫలితాలు కనిపిస్తాయి. లక్ష్మీదేవి కటాక్షంతో కోరికలు నెరవేరే అవకాశం ఉంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు రావచ్చు. ఉద్యోగస్తులకు పదోన్నతి లభించే అవకాశాలు కూడా ఉన్నాయి.
తులా రాశి
బుధుడు లగ్నం, దశమ స్థానాలపై ప్రభావం చూపుతున్నందున ఉద్యోగంలో గుర్తింపు, ఉన్నత స్థానం లభించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు కోరుకున్న ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు అందే సూచనలు ఉన్నాయి.
మకర రాశి
బుధుడు, గురుడు కలిసి అనుకూల స్థానంలో ఉండటంతో ఊహించని ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం, ఉద్యోగంలో ఆదాయం పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమై కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ప్రెషర్ కుక్కర్ విజిల్ వేస్తూ నీరు కారుతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సమస్యకు చెక్
దానం చేసేటప్పుడు ఈ 5 తప్పులు చేయొద్దు