ఈ 5 రాశుల వారికి.. బంగారం కంటే వెండి ధరిస్తే అదృష్టం కలిసొస్తుందట!
ABN , Publish Date - Jul 08 , 2026 | 10:46 AM
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ప్రతి రాశిపై గ్రహాల ప్రభావం భిన్నంగా ఉంటుందని విశ్వసిస్తారు. అందుకే కొన్ని రాశుల వారికి బంగారం కంటే వెండి ధరించడం మరింత శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ప్రతి రాశిపై గ్రహాల ప్రభావం వేర్వేరుగా ఉంటుంది. అందుకే కొన్ని రాశుల వారికి బంగారం కంటే వెండి ధరించడం మరింత శుభప్రదమని జ్యోతిష్యులు చెబుతారు. వెండి చంద్రుడికి సంబంధించిన లోహంగా భావిస్తారు. అందువల్ల దీన్ని ధరించడం వల్ల మనశ్శాంతి, ఆర్థిక స్థిరత్వం, అదృష్టం పెరుగుతాయని నమ్మకం.
కర్కాటక రాశి
కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడు.. మనస్సు, భావోద్వేగాలు, ప్రశాంతతకు ప్రతీకగా భావిస్తారు. అందుకే ఈ రాశి వారు వెండి ధరించడం వల్ల మానసిక ప్రశాంతత పెరగడంతో పాటు కుటుంబంలో ఆనందం, జీవితంలో శుభఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
వృషభ రాశి
వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు.. సంపద, ఐశ్వర్యం, సౌందర్యానికి సూచిక. ఈ రాశి వారు బంగారానికి బదులుగా వెండి ధరిస్తే ఆర్థిక స్థిరత్వం, అదృష్టం పెరుగుతాయని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొంటారు.
మీన రాశి
మీన రాశి వారు వెండి ధరించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉండటంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని నమ్ముతారు. అలాగే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మెరుగుపడి జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని జ్యోతిష్యులు చెబుతారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు ఉంగరం, గొలుసు లేదా ఇతర ఆభరణాల రూపంలో వెండి ధరించడం మంచిదిగా భావిస్తారు. దీని వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, ప్రశాంతత పెరిగి, అదృష్టం కలిసివస్తుందని విశ్వసిస్తారు.
తుల రాశి
తుల రాశికి కూడా శుక్రుడే అధిపతి. ఈ రాశి వారు వెండి ధరించడం వల్ల జీవితంలో సమతుల్యత, ఆర్థిక స్థిరత్వం పెరుగుతాయని జ్యోతిష్య నమ్మకం.
జ్యోతిష్య నమ్మకాల ప్రకారం.. వెండి ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
మనశ్శాంతి పెరుగుతుందని నమ్ముతారు.
కోపం, ఆందోళన తగ్గుతాయని చెబుతారు.
ఏకాగ్రత మెరుగుపడుతుందని విశ్వసిస్తారు.
భావోద్వేగాల్లో సమతుల్యత ఏర్పడుతుందని అంటారు.
శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉండేందుకు తోడ్పడుతుందని నమ్మకం.
Note: ఇందులోని సమాచారం జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
భర్త ముందు ఈ నాలుగు తప్పులు చేయొద్దు..
మినీ స్ట్రోక్.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు