వైసీపీ నుంచి బడ్డుకొండ సస్పెన్షన్
ABN , Publish Date - Oct 03 , 2026 | 04:24 AM
నెల్లిమర్ల నియోజకవర్గం మాజీ శాసన సభ్యుడు, మాజీ జడ్పీ చైర్మన్ బడ్డుకొండ అప్పలనాయుడుని వైసీపీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందటంతో ...
విజయనగరం, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): నెల్లిమర్ల నియోజకవర్గం మాజీ శాసన సభ్యుడు, మాజీ జడ్పీ చైర్మన్ బడ్డుకొండ అప్పలనాయుడుని వైసీపీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందటంతో క్రమశిక్షణ కమిటీ సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల బడ్డుకొండ వియ్యంకుడు, మాజీ జడ్పీ చైర్మన్, వైసీపీ మాజీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను) ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. చిన్న శ్రీను పార్టీ మారిన తరువాత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైసీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం సెప్టెంబరు 12న జరిగింది. ఆ సమావేశానికి బడ్డుకొండ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను వైసీపీలోనే కొనసాగుతానని అంటూ భావోద్వేగానికి గురయ్యారు. అయితే, అదేరోజు రాత్రి ఆయన్ను నెల్లిమర్ల నియోజవర్గం ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పించింది. ఇప్పుడు ఏకంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
ఈ వార్తలనూ చదవండి..
స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలిమెట్టు
శ్రీవారి ఆలయానికి ‘స్వచ్ఛ’ అవార్డు