3 కేజీల డ్రగ్స్‌తో పట్టుబడ్డ వైసీపీ నేత
ABN , Publish Date - Oct 19 , 2026 | 04:32 AM
కాకినాడకు చెందిన వైసీపీ మాజీ కార్పొరేటర్, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అనుచరుడు రోకళ్ల సత్యనారాయణ (సత్య) మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తూ కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో పట్టుబడ్డారు.
ద్వారంపూడి అనుచరుడు కొచ్చిలో అరెస్టు
విమానాశ్రయంలో డ్రగ్స్‌తో దొరికిన సత్య
బ్యాంకాక్ నుంచి సబ్బు బిళ్లల రూపంలో స్మగ్లింగ్
బ్లేడుతో గాయపరుచుకునే యత్నం.. హైడ్రామా
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
(కాకినాడ - ఆంధ్రజ్యోతి)
కాకినాడకు చెందిన వైసీపీ మాజీ కార్పొరేటర్, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అనుచరుడు రోకళ్ల సత్యనారాయణ (సత్య) మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తూ కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో పట్టుబడ్డారు. బ్యాంకాక్ నుంచి మూడు కిలోల డ్రగ్స్‌ను సబ్బుబిళ్లల రూపంలో తరలిస్తూ దొరికిపోయారు. పక్కా సమాచారంతో విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తనిఖీలు చేయగా, డ్రగ్స్ బయటపడ్డాయి. ఽథాయ్ లయన్ ఎయిర్ విమానంలో వచ్చిన సత్యతోపాటు కాకినాడకు చెందిన మరో నిందితుడు పందిరి అర్జున్‌కుమార్‌కు చెందిన రెండు బ్యాగుల్లో 20 ప్యాకెట్లు గుర్తించారు. ప్యాకెట్లలో మెథాక్వాలోన్ ఉన్నట్టు నిర్ధారించుకుని, వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది మే 25న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ద్వారంపూడి అనుచరుడిగా ఉన్న సత్య గతంలో కాకినాడ 32వ డివిజన్ కార్పొరేటర్‌గా పనిచేశారు. జగన్‌తో ఆయన సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. కాగా, డ్రగ్స్ ఎక్కడకు తరలించేందుకు సత్య పథకం పన్నాడనేది విచారిస్తుండగా, డీఆర్‌ఐ అధికారుల ఎదుటే సత్య బ్లేడ్‌తో కోసుకుని గాయపర్చు కునేందుకు ప్రయత్నించారు. ఆయనను అరె్‌స్టచేసి ఏ1గా కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు. ఈనెల 1న కేరళ హైకోర్టులో కేసు విచారణ జరగ్గా, నిందితుడికి న్యాయస్థానం బెయిల్ తిరస్కరించింది. కాగా విదేశాల్లో బియ్యం వ్యాపార లావాదేవీలను ద్వారంపూడి తరఫున సత్య నిర్వహించేవారనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీకి హైకోర్టులో ఎదురుదెబ్బ.. స్థానిక ఎన్నికల నామినేషన్ల గడువు పిటిషన్ కొట్టివేత
మున్సిపల్ ఎన్నికలు.. మేయర్ అభ్యర్థులపై ఉత్కంఠ.. సీఎం నిర్ణయంపై ఆసక్తి