Share News

జైలు నుంచే జడ్పీటీసీగా బరిలోకి వైసీపీ అభ్యర్థి

ABN , Publish Date - Oct 28 , 2026 | 05:36 AM

తిరుపతి జిల్లా పెళ్లకూరు మండల జడ్పీటీసీ వైసీపీ అభ్యర్థిగా నెల్లూరు జిల్లా సహకార బ్యాంకు మాజీ చైర్మన్‌ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి పోటీ చేస్తున్నారు.

జైలు నుంచే జడ్పీటీసీగా బరిలోకి వైసీపీ అభ్యర్థి

పెళ్లకూరు, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా పెళ్లకూరు మండల జడ్పీటీసీ వైసీపీ అభ్యర్థిగా నెల్లూరు జిల్లా సహకార బ్యాంకు మాజీ చైర్మన్‌ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్నారు. పొలాల వద్ద జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి దుర్మరణం పాలైన కేసులో ఆయన రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు.

ఆయన జైలు నుంచే తన అనుచరులతో నామినేషన్‌ వేయించారు. ముందు వైసీపీ తరఫున కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, ఆయన సతీమణి ప్రభావతమ్మ నామినేషన్లు వేశారు. మంగళవారం ప్రభావతమ్మ ఉపసంహరించుకోవడంతో సత్యనారాయణరెడ్డి వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు.

ఈ వార్తలనూ చదవండి:

తీరం దాటుతున్న ఆర్నబ్ తుఫాన్..!

ఆర్నబ్ తుఫాన్ వేళ.. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Updated Date - Oct 28 , 2026 | 05:36 AM