Share News

సౌత్‌ బిహార్‌ను మరిపించిన చంద్రబాబు

ABN , Publish Date - Nov 03 , 2026 | 06:22 AM

‘నామినేషన్లలో రిగ్గింగ్‌, ఎన్నికల్లో రిగ్గింగ్‌. రిగ్గింగ్‌ అనే పదానికి కూటమి ప్రభుత్వం కొత్త నిర్వచనం ఇచ్చింది. రిగ్గింగ్‌ చేయడంలో సౌత్‌ బిహార్‌ను మరిపించిన ఘనుడు మన సీఎం చంద్రబాబు’ అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు.

సౌత్‌ బిహార్‌ను మరిపించిన చంద్రబాబు

  • రిగ్గింగ్‌కు కొత్త నిర్వచనం ఇచ్చిన కూటమి ప్రభుత్వం: షర్మిల

అమరావతి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): ‘నామినేషన్లలో రిగ్గింగ్‌, ఎన్నికల్లో రిగ్గింగ్‌. రిగ్గింగ్‌ అనే పదానికి కూటమి ప్రభుత్వం కొత్త నిర్వచనం ఇచ్చింది. రిగ్గింగ్‌ చేయడంలో సౌత్‌ బిహార్‌ను మరిపించిన ఘనుడు మన సీఎం చంద్రబాబు’ అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ‘నామినేషన్లు వేయకుండా, ఓటేయనీయకుండా అడ్డుకోవడం ఎక్కడి ప్రజాస్వామ్యం? భయానక వాతావరణంలో జరిగిన ఎన్నికలివి. ఇదొక గెలుపా? ఇదా ఎన్నికలు నిర్వహించే తీరు? బూత్‌ క్యాప్చరింగ్‌, దొంగ ఓట్లు, దౌర్జన్యాలు జరిగినట్లు ఆధారాలున్న ప్రతి పోలింగ్‌ కేంద్రంలో తక్షణమే పోలింగ్‌ను రద్దు చేసి రీపోలింగ్‌ నిర్వహించాలి’ అని సోమవారం ఎక్స్‌ వేదికగా డిమాండ్‌ చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

త్వరితగతిన రాష్ట్రానికి సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ కస్టడీలో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి

Updated Date - Nov 03 , 2026 | 06:22 AM