Share News

స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ సీనియర్లకు బాధ్యతలు

ABN , Publish Date - Oct 14 , 2026 | 05:39 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో సీనియర్‌ నేతలకు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బాధ్యతలు అప్పగించారు.

స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ సీనియర్లకు బాధ్యతలు

అమరావతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో సీనియర్‌ నేతలకు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బాధ్యతలు అప్పగించారు. సీడబ్ల్యుసీ సభ్యుడు నీలకంఠాపురం రఘువీరారెడ్డికి ఏలూరు, పశ్చిమగోదావరి, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజుకు అనకాపల్లి, విశాఖ జిల్లాలు, సీడబ్ల్యుసీ సభ్యుడు గిడుగు రుద్రరాజుకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలంకు అన్నమయ్య, కర్నూలు జిల్లాలు, ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ ఎమ్మెల్యే మస్తాన్‌ వలీకి తూర్పు గోదావరి, కోనసీమ, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌కు మన్యం, అల్లూరి జిల్లాలు, మాజీ ఎంపీ హర్ష కుమార్‌కు కాకినాడ జిల్లా, ఏపీసీసీ మాజీ అధికార ప్రతినిధి తులసిరెడ్డికి అనంతపురం, సత్యసాయి జిల్లాలు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి నెల్లూరు, చిత్తూరు జిల్లాలు, మాజీ ఎమ్మెల్యే కమలమ్మకు ప్రకాశం, గుంటూరు జిల్లాలు, మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌కు పల్నాడు జిల్లా, మాజీ ఎమ్మెల్యే ఎలీజాకు నంద్యాల, తిరుపతి జిల్లాలు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు ఎన్‌టీఆర్‌, కృష్ణా జిల్లాలు, ఏపీసీసీ ఉపాధ్యక్షుడు సూర్యనాయక్‌కు కడప, బాపట్ల జిల్లాల బాధ్యతలు అప్పగించారు.

ఈ వార్తలనూ చదవండి:

కొత్త డీఎస్సీలో 290 పోస్టులు

గిన్నిస్‌ బుక్‌లోకి 75 గంటల డప్పుమోత

Updated Date - Oct 14 , 2026 | 05:40 AM