క్యాస్ట్ సర్టిఫికెట్లపై గట్టిగా పోరాడండి
ABN , Publish Date - Oct 14 , 2026 | 05:43 AM
వైసీపీ అధికారంలో ఉండగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడ్డ ప్రత్యర్ధులకు కుల ధృవీకరణ(క్యాస్ట్ సర్టిఫికెట్లు) పత్రాలను ఇవ్వడంలో తీవ్ర ఇబ్బందులు పెట్టిన నాటి సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి..
వైసీపీ సమన్వయకర్తలకు జగన్ నిర్దేశం
అమరావతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధికారంలో ఉండగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడ్డ ప్రత్యర్ధులకు కుల ధృవీకరణ(క్యాస్ట్ సర్టిఫికెట్లు) పత్రాలను ఇవ్వడంలో తీవ్ర ఇబ్బందులు పెట్టిన నాటి సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ఇప్పుడు అదే విషయంపై బెంబేలెత్తుతున్నారు. వైసీపీ అభ్యర్థులకు కుల ధృవీకరణ పత్రాలను ఇవ్వడం లేదని తాజాగా ఆయన ఆరోపించారు. మంగళవారం పార్టీ సమన్వయకర్తలతో ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చించారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల ఎంపికపైనా కసరత్తు చేశారు. విశాఖపట్నంలో వైసీపీ నేత శశికళకు ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వకుండా అగ్రవర్ణానికి చెందిన కాపు కులస్తురాలిగా పేర్కొంటూ సర్టిఫికెట్ ఇచ్చారని జగన్ ఆరోపించారు.
దీనిపై గట్టిగా నిలదీయాలని ఆమెకు సూచించారు. అలాగే, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో బలమైన అభ్యర్ధులను ఎంపిక చేస్తామన్నారు. బుధవారం నాటికే మునిసిపల్ కార్పొరేషన్ల అభ్యర్థులను ప్రకటిస్తామని జగన్ తెలిపారు. అయితే, రాష్ట్రస్థాయిలో క్యాస్ట్ సర్టిఫికెట్ల వ్యవహారంపై రాజీ పడవద్దని, గట్టిగా పోరాడాలని నేతలకు ఆయన సూచించారు.
ఈ వార్తలనూ చదవండి:
గిన్నిస్ బుక్లోకి 75 గంటల డప్పుమోత