రాష్ట్రాన్ని చంద్రబాబు జంగిల్ రాజ్లా మార్చారు
ABN , Publish Date - Oct 17 , 2026 | 05:05 AM
పారా మిలటరీ బలగాల పహారాతోనే స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరుగుతాయని వైసీపీ అధ్యక్షుడు జగన్ వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని కోర్టుల ముందు ఉంచుతామన్నారు.
పారా మిలటరీతోనే సజావుగా ఎన్నికలు.. మిథున్రెడ్డికి జగన్ ఫోన్
అమరావతి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): పారా మిలటరీ బలగాల పహారాతోనే స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరుగుతాయని వైసీపీ అధ్యక్షుడు జగన్ వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని కోర్టుల ముందు ఉంచుతామన్నారు. రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు జంగిల్ రాజ్లా మార్చారని విమర్శించారు. శుక్రవారం పుంగనూరు ఘటన జరిగిన తర్వాత పార్టీ ఎంపీ మిథున్రెడ్డితో ఆయన ఫోన్లో మాట్లాడారు. కూటమి గూండారాజ్పై న్యా యస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. ఎన్నికలు సజావుగా జరపాలన్న ఉద్దేశం చంద్రబాబుకు లేదని ఆరోపించారు. రెండున్నరేళ్ల పరిపాలన పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, అందుకే కూటమి నేతలు అరాచకాలు, దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు