రావణ్‌కు ఏడు రోజుల కస్టడీ
ABN , Publish Date - Sep 18 , 2026 | 06:19 AM
యూట్యూబర్ బచ్చలకూరి జోసఫ్ అలియాస్ రావణ్‌ను వారం రోజులపాటు పోలీసు కస్టడీకి ఇస్తూ గన్నవరం కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది.
విజయవాడ, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): యూట్యూబర్ బచ్చలకూరి జోసఫ్ అలియాస్ రావణ్‌ను వారం రోజులపాటు పోలీసు కస్టడీకి ఇస్తూ గన్నవరం కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. రావణ్ తన యూట్యూబ్ చానల్ ద్వారా దేశ సమగ్రతను దెబ్బతీసేలా వీడియోలు పోస్టు చేశారంటూ గన్నవరం పోలీసులు ఉపా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నెల్లూరులోని కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న రావణ్‌ను 15 రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదప్రతివాదనలు ముగియడంతో కోర్టు గురువారం తీర్పును వెలువరించింది. శుక్రవారం నుంచి ఈనెల 24వ తేదీ వరకు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చింది.
ఈ వార్తలనూ చదవండి: