ఓటు కొట్టు.. ‘కూపన్’ పట్టు!
ABN , Publish Date - Nov 30 , 2026 | 02:22 AM
పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలంలోని ఓ సర్పంచ్ అభ్యర్థి ఓటర్లకు బంపరాఫర్ ఇచ్చారు
తణుకు రూరల్, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలంలోని ఓ సర్పంచ్ అభ్యర్థి ఓటర్లకు బంపరాఫర్ ఇచ్చారు. తాయిలాలతోపాటు రూ.వెయ్యి కూపన్‌ను పంపిణీ చేశారు. ‘సర్పంచ్‌గా నన్ను గెలిపించింది. ఈ కూపన్‌ను తీసుకొని తణుకులోని కిరాణా, ఎలక్ట్రానిక్స్ దుకాణాలకు ఎక్కడికైనా వెళ్లండి. రూ.వెయ్యి విలువైన సరుకులు, వస్తువులు తెచ్చుకోండి’ అంటూ హామీ ఇచ్చారు. దీంతో ఆ అభ్యర్థి ఇచ్చిన కూపన్‌ను ఆ గ్రామస్థులు తీసుకురావడంతో పట్టణంలోని దుకాణాలు కళకళలాడాయి. ఆదివారం ఒక్కరోజే 1400 మంది కిరాణా సరుకులు తీసుకుని వెళ్లినట్టు సమాచారం. జనం ఒక్కసారిగా రావడంతో ఓ ఎలక్ర్టానిక్స్ షాపు ముందు కాస్త గందరగోళం ఏర్పడింది. దీంతో ఫ్లయింగ్ స్క్వాడ్ రంగ ప్రవేశం చేసిన షాపులను మూసివేయించారు.