నేడు పైడిమాంబ సిరిమానోత్సవం
ABN , Publish Date - Oct 27 , 2026 | 04:57 AM
ఉత్తరాంధ్ర ఇలవేల్పు విజయనగరం పైడిమాంబ సిరిమానోత్సవానికి సర్వం సిద్ధమైంది. మంగళవారం జరిగే ఉత్సవానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 3500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏరాటు చేశారు.
విజయనగరం/విజయనగరం రూరల్, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ఇలవేల్పు విజయనగరం పైడిమాంబ సిరిమానోత్సవానికి సర్వం సిద్ధమైంది. మంగళవారం జరిగే ఉత్సవానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 3500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏరాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు సిరిమాను తిరిగే ప్రక్రియ ప్రారంభించి, సాయంత్రం 5 గంటల్లోగా ముగించేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ రామసుందర్‌రెడ్డి మంగళవారం ఉదయం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
కాగా.. సిరిమానోత్సవానికి ముందు రోజు నిర్వహించే తొలేళ్ల ఉత్సవం సోమవారం రాత్రి వైభవంగా జరిగింది. మూడులాంతర్ల వద్ద చదురుగుడిలో, రైల్వేస్టేషన్ వద్ద వనంగుడిలో భక్తులు భారీగా తరలివచ్చి దర్శనాలు చేసుకున్నారు. పూజారి బంటుపల్లి వెంకటరావు ఇంటి నుంచి మహిళలు ఘటాలను ఊరేగింపుగా తీసుకుని వచ్చి అమ్మవారికి సమర్పించారు. సంప్రదాయం ప్రకారం పైడిమాంబను సిరిమానోత్సవానికి సిద్ధం చేస్తూ అర్ధరాత్రి 12 గంటల సమయంలో వివిధ నదీజలాలతో అభిషేకం చేశారు. కొంతమంది ప్రముఖులు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అర్చకులు, సిబ్బంది పరిమిత సంఖ్యలో ఉండి ఈ కార్యక్రమాన్ని జరిపించారు.
ఈ వార్తలనూ చదవండి:
బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడిన ‘అర్నబ్’
అతి తీవ్ర తుఫాను..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్