Share News

అధిక లాభాల ఆశ చూపి 27 లక్షలు మోసం

ABN , Publish Date - Nov 11 , 2026 | 05:42 AM

తమ సంస్థలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశచూపి టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తి నుంచి రూ.27.52 లక్షలు దోచుకున్నాడు.

అధిక లాభాల ఆశ చూపి 27 లక్షలు మోసం

  • టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా కాజేసిన కేటుగాడు

  • మధ్యప్రదేశ్‌లో విశాఖ యువకుడిపై కేసు నమోదు

  • ఇప్పటికే సైబర్‌మోసం కేసులో రిమాండ్‌లో నిందితుడు

విశాఖపట్నం, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): తమ సంస్థలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశచూపి టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తి నుంచి రూ.27.52 లక్షలు దోచుకున్నాడు. ఈ అభియోగంతో విశాఖ నగరానికి చెందిన యువకుడిపై అక్కడి జాబువా పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు నిందితుడు ఇప్పటికే వైద్యుడిని మోసం చేసిన కేసులో విశాఖ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేయడంతో ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నాడు.

నగరానికి చెందిన రైల్వే రిటైర్డ్‌ టీటీఈ సదరం శివతోపాటు ఆయన కుమారుడు ప్రేమ్‌సాగర్‌ ఇద్దరూ కలిసి అధిక లాభాలు వస్తాయని ఆశచూపించి తమ బంధువైన నగరంలోని ఒక వైద్యుడితోపాటు అతని భార్య వద్ద నుంచి భారీగా బంగారం, డబ్బు తీసుకుని మోసం చేశారు. దీనిపై బాధిత వైద్యుడు సీపీ శంఖబ్రత బాగ్చీని కలిసి ఫిర్యాదు చేయడంతో వారిద్దరిపై కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. శివ బెయిల్‌పై బయటకు రాగా... ప్రేమ్‌సాగర్‌ ఇంకా రిమాండ్‌లోనే ఉన్నాడు.


ఇదిలావుండగా... మధ్యప్రదేశ్‌లోని జాబువా పోలీసులు ఇటీవల నగరంలోని అక్కయ్యపాలెంలోని ఒక గోల్డ్‌ లోన్‌ ఫైనాన్స్‌ కంపెనీ కార్యాలయానికి వచ్చారు. ప్రేమ్‌సాగర్‌ ఖాతా నుంచి గోల్డ్‌లోన్‌ ఫైనాన్స్‌ కార్యాలయం ఖాతాకు నగదు బదిలీ అయిందని, ఆ లావాదేవీలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని కోరారు. ఫైనాన్స్‌ సంస్థ సిబ్బంది వివరాలపై ఆరా తీయగా... ప్రేమ్‌సాగర్‌ మధ్యప్రదేశ్‌కు చెందిన పటేల్‌ అనే వ్యక్తికి టెలిగ్రామ్‌ ద్వారా పరిచయమై తాను పనిచేస్తున్న సంస్థలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని ఆశపెట్టి రూ.27.52 లక్షలు కాజేసినట్టు గుర్తించారు.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు

30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!

Updated Date - Nov 11 , 2026 | 05:44 AM