విశాఖ సినిమా రాజధాని కాబోతుంది: దర్శకుడు మెహర్ రమేశ్
ABN , Publish Date - Aug 29 , 2026 | 09:16 PM
విశాఖ త్వరలో సినిమా రాజధాని కాబోతుందని దర్శకుడు మెహర్ రమేశ్ అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఎమ్మెల్యే బాలకృష్ణ, మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో విశాఖ అభివృద్ధి చెందుతుందని అన్నారు.
ఇంటర్‌నెట్ డెస్క్: విశాఖ త్వరలో సినిమా రాజధాని కాబోతుందని దర్శకుడు మెహర్ రమేశ్ అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఎమ్మెల్యే బాలకృష్ణ, మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో విశాఖ అభివృద్ధి చెందుతుందని అన్నారు. విశాఖలో ఎక్కువ షూటింగ్స్ జరిగేలా కృషి చేస్తున్నామన్నారు. గూగుల్, ఐటీ హబ్‌గా విశాఖ అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు.
సబ్సీడీలు విడుదల చేస్తున్నాం: భరత్ భూషణ్
రాజధాని అమరావతి అభివృద్ధితో పాటు సినీ రంగం పరంగా విశాఖ అభివృద్ధి జరుగుతుందని ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ భరత్ భూషణ్ అన్నారు. విశాఖలో డబ్బింగ్స్‌కి ఎటువంటి ఇబ్బంది రాకుండా అనేక రకాల డబ్బింగ్ థియేటర్స్‌ను అభివృద్ధి చేయనున్నామని చెప్పారు. త్వరలో విశాఖలో నేషనల్ కానీ, నంది అవార్డ్స్ కానీ జరిగే విధంగా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. సినిమా షూటింగ్స్ పరంగా సింగిల్ విండో విధానాన్ని అతి కొద్ది రోజుల్లో తీసుకువస్తామని తెలిపారు. గతంలో కొన్ని సబ్సిడీలు ఆగిపోయాయని, ఇప్పుడు అవన్నీ విడుదల చేస్తున్నామని వెల్లడించారు.
ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘రానున్న రోజుల్లో ఆంధ్రాలో షూటింగ్స్ జరిగే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. ఒక సంవత్సరంలో విడుదలయ్యే 200 సినిమాలలో.. దాదాపు 180 కన్నా ఎక్కువ చిన్న సినిమాలే ఉంటున్నాయి. సినీ పరిశ్రమ బ్రతుకుతుంది అంటే అది కేవలం చిన్న సినిమాల వల్లే. సినిమాలో విషయం ఉంటే ఎవరితో పని లేదు. టికెట్స్ ధరలు పెంచే విషయంలో ఎలాంటి రాజీ లేదు’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. రూ.4.07 కోట్ల తక్షణ సాయం
చిన్నారిపై హత్యాచారం.. పోలీస్ ఎన్‌కౌంటర్‌లో నిందితుడి హతం..