జనాన్ని ముంచేసిన ఎస్‌ఐ!
ABN , Publish Date - Sep 23 , 2026 | 04:58 AM
బాధ్యతగల ఓ స్టేషన్ పోలీసు అధికారి.. ఆన్‌లైన్ జూదాల, ట్రేడింగ్ మోసాలపట్ల ప్రజలను అప్రమత్తం చేయాలి! కానీ.. ధనార్జనే ధ్యేయంగా.. తానే ఆ ‘వ్యాపారం’లోకి దిగి మరికొంతమందిని ముంచేశారు.
ఆన్‌లైన్ ఇన్వె్‌స్టమెంట్ ట్రేడింగ్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్
‘క్యూవీఎస్ఈ’ యాప్‌లో జనంతో రూ.2 కోట్లు డిపాజిట్ చేయించిన వైనం
ఈ నెల 7న క్లోజ్ అయిపోయిన యాప్
స్టేషన్ చుట్టూ తిరుగుతున్న బాధితులు
మద్దిలపాలెం (విశాఖపట్నం), సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): బాధ్యతగల ఓ స్టేషన్ పోలీసు అధికారి.. ఆన్‌లైన్ జూదాల, ట్రేడింగ్ మోసాలపట్ల ప్రజలను అప్రమత్తం చేయాలి! కానీ.. ధనార్జనే ధ్యేయంగా.. తానే ఆ ‘వ్యాపారం’లోకి దిగి మరికొంతమందిని ముంచేశారు. వాస్తవానికి రెండు తెలుగు రాష్ర్టాలతోపాటు.. దేశవ్యాప్తంగా ‘క్యూవీఎస్ఈ’ ఇన్వెస్టెమెంట్ యాప్ ద్వారా వేల కోట్లు పోగొట్టుకుని లబోదిబోమంటున్నారు. ఈ కోవలోనే.. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధి.. ఈస్ట్ సబ్ డివిజన్‌లో గల ఓ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్.. క్యూవీఎస్ఈ ఆన్‌లైన్ యాప్ ద్వారా జనాన్ని ముంచేశారు. ఇన్వెస్టెమెంట్, ట్రేడింగ్ పేరిట ‘క్యూవీఎస్ఈ’ యాప్‌లో తొలుత ఆయన జాయిన్ అయి, ఆ తర్వాత జనాలతో భారీగా డబ్బులు పెట్టించారు. కమీషన్ రూపేణా రూ.లక్షలు జేబులో వేసుకున్నారు. తీరా ఇప్పుడు ఆ యాప్ పనిచేయకపోవడంతో ముఖం చాటేశారు. వివరాలివీ.. గతేడాది జూలై నుంచి ఇండియాలో ‘క్యూవీఎస్ఈ’ యాప్ కార్యకలాపాలు మొదలయ్యాయి. రూ.50 వేలు డిపాజిట్ చేస్తే రోజుకు రూ.600 నుంచి రూ.700 డిపాజిట్‌దారుడి ఖాతాలో జమ చేస్తామని ప్రకటించింది. అలాగే రూ.50 వేలు డిపాజిట్ చేసిన వ్యక్తి గొలుసుకట్టు పద్ధతిలో తన కింద ఎంతమందితో డిపాజిట్ చేయిస్తే అంత కమీషన్ ఇస్తామని పేర్కొంది. ఇదేదో బాగుందనుకున్న ఎస్‌ఐ.. ముందు తాను డిపాజిట్ చేసి, తరువాత వందలాది మందితో రూ.2 కోట్లకు డిపాజిట్లు చేయించారు. సదరు ఎస్‌ఐ ఏడాదిలో కమీషన్ రూపేణా సుమారు రూ.50 లక్షల వరకు ఆర్జించినట్టు ఆరోపణలున్నాయి.
సెలవులో ఎస్‌ఐ..
క్యూవీఎస్ఈ యాప్ ఈనెల ఏడో తేదీన ఆకస్మికంగా క్లోజ్ అయింది. దీంతో బాధితులు ఎస్‌ఐను కలిసేందుకు పోలీస్ స్టేషన్‌కు రావడం ప్రారంభించారు. మొదట్లో ఏదో సర్దిచెప్పి పంపించారు. రానురాను డిపాజిటర్లు వెంటపడుతుండడంతో ఎస్‌ఐ సెలవుపై వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ పోలీస్ స్టేషన్‌లో సిబ్బందిని విచారించినట్టు తెలిసింది. ప్రస్తుతం బాధితులెవరూ ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు సైలెంట్‌గా ఉన్నారు.
ఈ వార్తలనూ చదవండి...
పాదగయలో విషాదం.. పుష్కరిణిలో స్నానానికి దిగి యువకుడి గల్లంతు..
సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం