Share News

సరుకు రవాణాలో విశాఖ పోర్టు రికార్డు

ABN , Publish Date - Oct 15 , 2026 | 04:51 AM

సరుకు రవాణాలో విశాఖపట్నం పోర్టు సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఆర్థిక సంవత్సరం (2026- 27)లో వంద మిలియన్‌ టన్నుల సరుకు రవాణా చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా..

సరుకు రవాణాలో విశాఖ పోర్టు రికార్డు

విశాఖపట్నం, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): సరుకు రవాణాలో విశాఖపట్నం పోర్టు సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఆర్థిక సంవత్సరం (2026- 27)లో వంద మిలియన్‌ టన్నుల సరుకు రవాణా చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా అక్టోబరు 13 నాటికి అంటే 196 రోజుల్లో సగం (50 మిలియన్‌ టన్నులు) పూర్తి చేసింది. ఈ మైలురాయిని అందుకోవడానికి గత ఆర్థిక సంవత్సరంలో 213 రోజులు పట్టింది. ఈ రికార్డు సాధనలో కృషిచేసిన ట్రాఫిక్‌ విభాగాన్ని చైర్మన్‌ జేఎస్‌ బింద్రా, డిప్యూటీ చైర్‌పర్సన్‌ రోష్ని అపరాంజి కోరాటి అభినందించారు. ఇదే స్ఫూర్తితో 100 మిలియన్‌ టన్నులు పూర్తిచేయాలని ఆకాంక్షించారని సెక్రటరీ శంకర్‌బాబు తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్‌టెన్షన్‌ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి

హోర్ముజ్ జలసంధిలో మైన్‌ను ఢీకొని కార్గో నౌక మునక..

Updated Date - Oct 15 , 2026 | 04:51 AM